నీ ఫొటో కోసం ఎంతగా ఎదురు చూశామో తెలుసా..!
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగల్లో ఒకటి ఓనం. ముఖ్యంగా కేరళలో ఈ పండుగను పది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మహారాజు మహాబలిని స్వాగతిస్తూ, ప్రజలంతా తమ ఇళ్ల ముంగిట అందమైన పూల రంగవల్లులు (పూక్కలం) వేసి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఓనం రోజున ప్రత్యేకంగా తయారుచేసే 'సద్య' అనే భోజనం ఈ పండుగకే ప్రత్యేక ఆకర్షణ. ఈ సద్యలో 20కి పైగా రకాల వంటకాలు ఉంటాయి.
కేరళలోని ఈ పండుగను దేశవ్యాప్తంగా సినీ తారలు కూడా తమ కుటుంబాలతో కలిసి ఘనంగా జరుపుకుంటారు. సాంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి, పూక్కలం వేసి, సద్య భోజనం చేస్తూ, ఆ ఆనంద క్షణాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. ఈ పండుగ రోజున వారి పోస్ట్‌లు ఎంతగానో వైరల్ అవుతుంటాయి. కేరళ హీరోయిన్లు ఓనం పండుగ సందర్భంగా చీరలు కట్టుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

ముఖ్యంగా కీర్తి సురేశ్ ఎలాంటి చీర ధరిస్తారా అంటూ అభిమానులు ఎదురు చూస్తుంటారు. పెళ్లి తర్వాత జరిగిన తొలి ఓనం పండుగ కావడంతో భర్తతో కలిసి పండగను సెలబ్రేట్ చేసుకుంది. కీర్తి సురేష్ ఓనం సందర్భంగా ధరించిన చీర అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. తెలుపు రంగులో ఉండే సంప్రదాయబద్ధమైన కేరళ కాసవు చీర ధరించి కీర్తి పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. బంగారు జరీ అంచుతో మెరిసిపోతున్న ఆ చీరలో కీర్తి అందం మరింత రెట్టింపయింది.
పెద్దగా మేకప్ లేకుండా, సహజమైన చిరునవ్వుతో ఉన్న కీర్తి లుక్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ఓనం పండుగ స్ఫూర్తిని, కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ కీర్తి పోస్ట్ చేసిన ఫొటోలు పండుగ వాతావరణాన్ని మరింత పెంపొందించాయి. ఈ ఓనం పండుగ కీర్తి సురేష్‌తో పాటు, ఆమె అభిమానులందరికీ ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది.












Click it and Unblock the Notifications