సడన్‌గా చూసి కొరియన్ అమ్మాయి అనుకున్నా బాసూ..!
హీరోయిన్ కీర్తి సురేశ్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేశ్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా 'మహానటి' సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.
కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదనే గుర్తింపు దక్కించుకున్నారు.ఇటీవల కాలంలో కీర్తి సురేశ్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్‌ను ముందుకు సాగిస్తున్నారు. గతంలో కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి టాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేశ్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది.

నేటి తరంలో పద్దతిగా కనిపిస్తే అవకాశాలు రావని గ్రహించిన కీర్తి సురేశ్, ఈ రూల్స్‌ను బ్రేక్ చేస్తోంది. కీర్తి సురేశ్ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. కీర్తి సురేశ్ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఓ రేంజ్‌లో అందాలను ఆరబోసింది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. ఇక గతేడాది కీర్తి సురేశ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 15 ఏళ్ల తన ప్రేమను పరిచయం చేస్తూ మహానటి సర్ ప్రైజ్ ఇచ్చింది.
కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేష్. తన ప్రియుడు ఆంటోనినే కీర్తి సురేష్ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కీర్తి ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఆప్డేట్స్ ఇస్తుంటుంది.పెళ్లి తర్వాత వరుస ఫొటో షూట్స్‌తో మతి పోగొడుతోంది.
కీర్తి సురేశ్ తాజాగా తన సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేసింది. స్టైలిష్ డ్రెస్ ధరించి డిఫరెంట్ లుక్‌లో దర్శనమిచ్చింది.కర్లింగ్ హెయిర్‌తో బ్లూ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సుతో కనిపించి అభిమానులకు షాకిచ్చింది. అయితే కీర్తి లేటెస్ట్ లుక్స్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. సడన్‌గా చూస్తే కొరియన్ అమ్మాయి అనుకున్నాఅంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ఈ లుక్ నీకు సెట్ కాలేదంటూ మరో నెటిజన్ రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం కీర్తి సురేశ్ లుక్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications