ఆ హీరో కోసం ముంబైకి వెళ్లిన కీర్తి సురేష్

హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా 'మహనటి' సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.

కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఇటీవల కాలంలో కీర్తి సురేష్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ లాగేస్తున్నారు.ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్‌ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి ట్యాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. అయితే ఇప్పుడు ఆ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ ఇచ్చిందని తెలుస్తోంది.

keerthy suresh shifted to mumbai

ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకు పైగానే సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌‌ల మధ్య కొన్ని లిప్‌ లాక్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇక బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత అక్కడి నీళ్లు బాగా వంట పట్టినట్టు ఉన్నాయి.అక్కడకు వెళ్లిన తరువాత కీర్తి సురేష్ గ్లామర్ డోస్ పెంచింది.

ఇదిలా ఉంటే కీర్తి సురేష్ మరో బాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ఓ మూవీ హర్రర్‌ & కామెడీ జోనర్‌గా రూపొందనుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మూవీ టీమ్ ఆమెని అప్రోచ్‌ కాగా.. గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ అక్షయ్‌ కుమార్ సినిమా ఖాయమైతే కీర్తి సురేష్ బాలీవుడ్‌కు మకాం మార్చడం ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+