ఇది బికినీ షో కాదు అంతకు మించి..!

బాలీవుడ్‌లో ఇప్పటికిప్పుడు స్టార్ హీరోయిన్ ఎవరంటే అందరు ఠక్కన చెప్పే పేరు కియారా అద్వానీ. వరుస సినిమాల్లో నటిస్తూ అక్కడ స్టార్ హీరోయిన్‌గా కియారా అద్వానీ మారిపోయింది. ఇదే సమయంలో తెలుగులో కూడా మహేష్ బాబు, రామ్ చరణ్ హీరోల వంటి సినిమాల్లో నటించి సౌత్‌లో కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. మహేష్ బాబుతో భరత్ అనే నేను, రామ్ చరణ్‌తో వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటించింది.

కియారా అద్వానీ తాజాగా నటించిన చిత్రం వార్ -2. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్నారు.ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లు ఆకట్టుకున్నాయి. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే..ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలున్నప్పటికీ, స్క్రీన్ ప్రెజెన్స్ మొత్తం కూడా కియారా అద్వానీ కొట్టేసింది.

Kiara Advani dominated star heroes like NTR and Hrithik Roshan in a bikini

టీజర్‌లో బికినీలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ లుక్ గురించి సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది, ఆమె ఫిట్‌నెస్ ,గ్లామర్‌ను చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఆమె సినిమాల్లో బికినీలో కనిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.తాజాగా విడుదల చేసిన సాంగ్‌లో కూడా కియారా అద్వానీ బికినీతో కనిపించి అభిమానులకు కిక్ ఇచ్చింది. హృతిక్ రోషన్ వంటి హ్యాండ్సమ్ ఉండి కూడా కియారా గురించే చర్చ సాగుతుందంటే ఆమె అందంతో ఎంతలా కట్టిపడేసిందో అర్థం చేసుకోవచ్చు.

ఎప్పటికప్పుడు విభిన్నంగా, మరింత అందంగా కనిపిస్తూ కవ్విస్తూ ఉంది. ఈసారి అంతకు మించి అంటూ ముద్దుగుమ్మ బికినీ ఫొటోలు ఉన్నాయి. ప్రస్తుతం కియారా బికినీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+