10 ఏళ్లుగా ఒక్క హిట్ లేదు..అయినా దేశంలోనే రిచెస్ట్ హీరో.. ఎవరో తెలుసా..?
దేశంలోనే రిచెస్ట్ యాక్టర్ ఎవరు అని అడిగితే.. టక్కున ప్రభాస్ అని చెప్తారా..? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఏ రజనీకాంతూ, అమితాబ్ బచ్చన్ అనుకున్నా రాంగే.. మరి పుష్ప-2 అల్లు అర్జున్ మేనియాలో పడి బన్నీ అంటారా? కాదు మరి ఎవరూ? అని అడిగితే అక్కినేని నాగార్జున అని చెప్తాను. అవును.. వన్స్ ఏ కింగ్.. ఆల్వేస్ కింగ్ అని నిరూపించుకుంటున్నారు అక్కినేని నాగార్జున. ఇండస్ట్రీలోనే కాదు ఆస్తుల విషయంలోనూ బాలీవుడ్ బడా స్టార్స్ ను వెనక్కునెట్టి నేనే కింగ్ అని ప్రూవ్ చేశారు. కింగ్ నాగార్జున ఇప్పుడు తెలుగులోనే కాదు ఇండియన్ సినిమా పరిశ్రమలోనే రిచెస్ట్ యాక్టర్ అని కథనాలు వస్తున్నాయి.
కింగ్ నాగార్జున కుటుంబానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటివరకు దాదాపు 95కుపైగా చిత్రాలు చేసిన కింగ్ నాగార్జున హిట్స్ కంటే ఫ్లాప్ లనే ఎక్కువ చవిచూశారు. కానీ తన విలక్షణమైన నటన, రొమాంటిక్ , ఫ్యామిలీ క్యారెక్టర్స్ తో సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఈ మధ్య పదేళ్ల నుంచి ఆయన సరైన హిట్ చూడలేదు. బంగార్రాజు, నా సామి రంగ, రాజుగారిగది-2 లాంటి సినిమాలు పర్వాలేదు అనిపించినా అనుకున్నంత స్థాయిలో మాత్రం కలెక్షన్స్ రాలేదు. ఇప్పుడు నాగ్ కంబ్యాక్ కోసం అటు అక్కినేని ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ మూవీ లవర్స్ సైతం ఎదురుచూస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇప్పుడు ఆయన రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ లాంటి బిగ్ స్టార్స్ ను కూడా దాటేశారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ. 3,572 కోట్లు. నాగ్ కంటే ముందు షారుఖ్ ఖాన్ మాత్రమే ఉన్నారు. కానీ అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి బడా స్టార్స్ ను కూడా ఆయన దాటేసి రెండో ప్లేస్ కైవసం చేసుకున్నారు. ఇక సల్మాన్ ఖాన్ ఆస్తుల విలువ రూ. 2900 కోట్లు, అమితాబ్ బచ్చన్ ఆస్తుల విలువ రూ. 3200కోట్లు,అమీర్ ఖాన్ ఆస్తుల విలువ రూ. 1900కోట్లు గా ఉంది.
ప్రస్తుతం కింగ్ నాగార్జున "కుబేర" మూవీలో నటిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న "కూలీ" మూవీలోనూ నాగ్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇక నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య ప్రస్తుతం తెలుగులో సక్సెస్ పుల్ హీరోగా కొనసాగుతున్నారు. చిన్న కుమారుడు అఖిల్ కూడా వరుస సినిమాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications