నాగార్జున మామ చాలా అందగాడు: సమంత
ఓ బేబీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో సమంత పాల్గొన్నారు. తన స్నేహితురాలు నందినీరెడ్డి తీసిన సినిమా కాబట్టి దానికి ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. ఓ టీవీషోలో కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా యాంకర్ నుంచి సామ్ కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. తమిళ స్టార్ హీరో సూర్య, తెలుగు మన్మథుడు నాగార్జున.. వీరిద్దరిలో అందగాడు ఎవరు అని అడిగారు. దానికి సమంత ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రం తడుముకోకుండా నా మామగారే అత్యంత అందమైన వ్యక్తి అని సమాధానం చెప్పింది. ఆ సందర్భంగా నాగార్జున మన్మథుడు సినిమాలో ఓ డైలాగ్ ను కూడా సరదాగా ప్రస్తావించింది.
నాగార్జునతో తెగిపోయిన బంధం
అయితే ఇదంతా 2019లో జరిగింది. అప్పటి సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సమంతకు మొదటి నుంచి తన మాజీ మామ నాగార్జున అంటే ఎంతో ఇష్టం. ఆయనపై చేసే వ్యాఖ్యలు, ఆయనపై చూపించే ఆప్యాయతను బట్టి అర్థమవుతుంటుంది. నాగచైతన్యతో విడిపోకముందు నాగార్జున కూడా సొంత కూతురిలా సమంతను చూసుకునేవారు. దురదృష్టవశాత్తూ వారిద్దరూ విడిపోవడంతో నాగార్జునతో బంధం కూడా తెగిపోయింది. ఎంత అనుబంధం ఉన్నప్పటికీ కాలం కంటే గొప్పది ఏదీ కాదు అనే దానికి ఇది ఒక ఉదాహరణ.

అవన్నీ ఒట్టి పుకార్లే
అయితే నాగార్జున ఈనెల 29వ తేదీన తన 66వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సమంత గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. నాగచైతన్య.. శోభితను వివాహం చేసుకున్న తర్వాత వారి వివాహ ఫొటోలను నాగ్ తన సామాజిక మాధ్యమ ఖాతాలో పంచుకున్నారు. సమంత దర్శకుడు రాజ్ నిడుమోరుతో ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయికానీ సమంత మేనేజర్ వాటిని ఖండించారు. అవి కేవలం పుకార్లే అన్నారు. వాస్తవ విరుద్ధంగా ప్రచారం చేస్తున్నారంటూ సామ్ మేనేజర్ విమర్శించారు.












Click it and Unblock the Notifications