పెళ్లై ఏడాది కాలేదు.. అప్పుడే పేరెంట్స్.. టాలీవుడ్ కొత్త జంట యమ స్పీడ్ గురూ..!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గుడ్ న్యూస్ చెప్పాడు. ఆయన సతీమణి హీరోయిన్ రహస్య ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపాడు. దీంతో నెటిజన్లు కిరణ్- రహస్య స్టార్ కపుల్స్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.
టాలీవుడ్ యువ కపుల్స్ కిరణ్ అబ్బవరం- రహస్య తల్లిదండ్రులయ్యారు. రహస్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు కిరణ్ అబ్బవరం సామాజిక మాధ్యమం ద్వారా తెలిపాడు. "మగబిడ్డ పుట్టాడు. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్యూ రహస్య.. జై శ్రీరామ్" అని కిరణ్ అబ్బవరం తన ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. అంతేకాక బాబుకు సంబంధించిన ఫస్ట్ ఫొటోని షేర్ చేశాడు. ఇందులో కిరణ్ తన కుమారుడి చిట్టి పాదాలను ముద్దాడుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం రాజావారు..రాణివారు(2019) చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. యువ నటి రహస్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే షూటింగ్ సమయంలోనే ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత దాదాపు 5ఏళ్ల పాటు సీక్రెట్ గా రిలేషన్ షిప్ లో గడిపారు. ఇక 2024ఆగస్టులో కుటుంబసభ్యులు, అతికొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.

రాజావారు..రాణివారు చిత్రం తర్వాత ఎస్ ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే చిత్రాలతో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు కిరణ్ అబ్బవరం. ఇటీవల విడుదలైన క చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ మూవీ నిలిచింది.
Blessed with a Baby Boy 😇
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) May 22, 2025
Happy Hanuman Jayanthi 🙏#Jaisreeram pic.twitter.com/UG5Ztky8gd
సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశాంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాను సుదీప్, సందీప్ ద్వయం తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.53 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం దిల్ రుబా మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.












Click it and Unblock the Notifications