'క' మూవీ రివ్యూ: కిరణ్ అబ్బవరం సినిమాలు మానేస్తారా.. తీస్తారా..?

టాలీవుడ్ యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. 'రాజావారు , రాణి గారు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం, తన తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఆ తర్వాత SR కల్యాణ మండపం అంటూ మరో హిట్‌‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆ తర్వాతే కిరణ్ అబ్బవరం కెరీర్ గాడి తప్పింది. మనోడు నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో తీసిన సినిమానే 'క'. ఈ సినిమా కొత్తగా లేకపోతే ఇక మీదట తాను సినిమాలు తీయనని కిరణ్ అబ్బవరం శపథం చేశారు. దీపావళి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కథ
వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే వ్యక్తి అమ్మానాన్న లేని అనాధగా ఒక అనాధ శరణాలయంలో పెరుగుతూ ఉంటాడు. ఇక అక్కడ ఒక అమ్మ కొడుకుకి రాసిన ఉత్తరాన్ని చదువుతాడు. ఆ లెటర్ లో ఉన్న అక్షరాలను చదివిన తర్వాత ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మా అమ్మ ఉంటే కూడా ఇలానే రాసి ఉండేదేమో అని అనుకుంటాడు. ఇక అప్పటినుంచి అందరి లెటర్లని చదవడానికి అతను ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు.

kiran abbavaram ka movie review and rating

ఇక కాలక్రమంలో వాసుదేవ్ కృష్ణ గిరి అనే ఊళ్లో పోస్ట్ మ్యాన్ ఉద్యోగాన్ని చేస్తూ ఉంటాడు. ఇక అక్కడ అందరి లెటర్లను చదువుతూ అన్ని విషయాలను తెలుసుకుంటాడు. ఇక అప్పుడే ఆయనకి సత్యభామ(తన్వి రామ్) పరిచయం అవుతుంది. ఇక ఆ ఊరిలో కొంతమంది అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. దీంతో అతడికి పెద్ద సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్యలేంటి.. ఈ అమ్మాయిల అదృశ్యం వెనుక ఉన్నదెవరు.. వారిని వాసుదేవ్ పట్టుకున్నాడా.. వాసుదేవ్ కి సత్యభామ తో పెళ్ళి అయిందా? లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
చుట్టూ కొండల మధ్య లోతులో ఉండే ఒక ఊరు. మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి పడిపోయే ఆ ఊరిలో వరుసగా అమ్మాయిలు అదృశ్యం అవుతుంటారు. అది కూడా తెల్లవారుజామునే వారి జాడ కనిపించకుండా పోతుంది. ఆ ఊర్లోకి వచ్చే ఓ పోస్ట్ మ్యాన్ ఈ మిస్టరీని ఎలా ఛేదించాడన్నది 'క' కథ. ఈ సినిమాను సుజిత్ సందీప్ అనే ఇద్దరు దర్శకులు తెరకెక్కించారు. అయితే ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగానే ముందుకు సాగింది. నిజానికైతే ఈ సినిమాతో ఒక డిఫరెంట్ అటెంప్ట్ ని చేశారనే చెప్పాలి. కథ ఓకే అనిపించినప్పటికీ స్క్రీన్ ప్లే లో మాత్రం చాలా వైవిధ్యమైన ఎలిమెంట్స్ ని వాడారు. ముఖ్యంగా క్లైమాక్స్ విషయానికి వస్తే వేరే లెవెల్లో ఉందనే చెప్పాలి.

ఎందుకంటే సినిమా మొత్తం ఒకెత్తయితే, క్లైమాక్స్ మాత్రం పీక్స్‌లో ఉంది. ఇక ఇలాంటి క్లైమాక్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు రాలేదనే చెప్పాలి. ప్రీ క్లైమాక్స్ డల్ అయిందని మనం అనుకునే లోపే క్లైమాక్స్ లో ఒక అద్భుతాన్ని చూపించారనే చెప్పాలి. ముఖ్యంగా ఈ దర్శకులకు స్క్రీన్ ప్లే మీద బాగా పట్టున్నట్టుగా కనిపిస్తుంది. ఈ సినిమాకి ఇద్దరు దర్శకులు అవ్వడం వల్ల క్రెడిట్ ఇద్దరికి దక్కుతుంది. ముఖ్యంగా సినిమా లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ప్రతి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగానే ఉంది. ఇక మొదటి నుంచి చివరి వరకు బోర్ కొట్టించకుండా సాగుతుంది.

kiran abbavaram ka movie review and rating

నటీనటుల పర్ఫామెన్స్
ముందుగా కిరణ్ అబ్బవరంకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి కథను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. తాను మొదటి నుంచి చెబుతున్నట్టుగా 'క' ఒక డిఫరెంట్ జోనర్ సినిమా. కిరణ్ అబ్బవరం ఈ సినిమాని ఒక్కడే తన భుజాల మీద మోసాడనే చెప్పాలి. ఇక మొదటి నుంచి చివరి వరకు తను ఈ సినిమాని ఎక్స్‌ట్రా ఆర్డినరీగా నడిపించాడు. ముఖ్యంగా ఇంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే ఆయన ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడనే చెప్పాలి. ఇక అందులో భాగంగానే ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా చాలావరకు ప్రయత్నం చేశాడు.

ఇక ఈ సినిమాలో తను చాలా కష్టపడ్డాడనే విషయం మనకు సినిమా చూస్తే అర్థమవుతుంది.ఇక హీరోయిన్ తన్వి రామ్ చేసిన సత్యభామ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. కథలో అంతర్లీనంగా ఉన్న ఈ క్యారెక్టర్ చూడ చక్కగా ఉంది. అలాగే ఈ సినిమాకి ఆమె చాలా వరకు ప్లస్ అయిందనే చెప్పాలి... 'ఆయ్' ఫేమ్ నయన్ సారిక మరోసారి తన క్యూట్ లుక్స్.. నటనతో ఆకట్టుకుంది. తన మేకప్ చాలా బాగుంది. అలాగే మిగిలిన ఆర్టిస్టులందరు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక ఓవరాల్ గా అందరు తమ తమ నటనతో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

kiran abbavaram ka movie review and rating

సాంకేతిక వర్గం
టెక్నికల్ గా 'క'లో మంచి క్వాలిటీ కనిపిస్తుంది. ఈ సినిమాకు మ్యూజిక్ పెద్ద ఎస్సెట్ అని చెప్పాలి.'క' సినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందించారు.థ్రిల్లర్ సినిమాలకు అదిరిపోయే ఆర్ఆర్ ఇస్తాడని పేరున్న అతను.. 'క'లో అదరగొట్టేశాడు. ఒక డిఫరెంట్ థీమ్ తో సాగే ఆర్ఆర్ సినిమాలో ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేయించడంలో కీలక పాత్ర పోషించింది. ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. కొన్ని షాట్స్ అయితే అద్భుతంగా తీశారు.ఈ సినిమా బాగా రావడానికి విజువల్స్ కూడా ముఖ్యపాత్ర వహించాయి. ఇక ఎడిటర్ కూడా చాలా వరకు తన బాధ్యతని నిర్వర్తించాడనే చెప్పాలి. అక్కడక్కడ సెకండ్ హాఫ్ లో కొంతవరకు సీన్లను కట్ చేసి ఉంటే బాగుండేది అనిపించినప్పటికి దర్శకుడు సలహా మేరకు ఆ సీన్‌లను కట్ చేయలేకపోవచ్చు.

బోటమ్ లైన్
కంటెంట్ ఉన్నాడోకి కటౌట్ అవసరం లేదు. కిరణ్ అబ్బవరం నిరభ్యంతరంగా సినిమాలు చేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+