"దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్"కు కిరణ్ అబ్బవరం మూవీ..
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రామిసింగ్ నటుడిగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన శైలిలో విభిన్న పాత్రలలో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజు వారు రాణిగారు సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గానే 'క 'చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు.
ఇప్పుడు 'క' చిత్రం మరో అరుదైన ఘనత దక్కించుకుంది. ఈ సినిమా 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్'కు నామినేట్ అయ్యింది. ఉత్తమ చిత్రం విభాగంలో ఈ చిత్రం నామినేట్ అయినట్టు సదరు సంస్థ ప్రకటించింది. ఢిల్లీ వేదికగా ఈ నెలాఖరున జరగనున్న వేడుకల్లో విజేతలకు ఈ అవార్డులను అందించనున్నారు.

చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. సుజిత్, సందీప్‌లు సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. కిరణ్ అబ్బవరం సొంత బ్యానర్ సమర్పణలో చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. ఫాంటసి థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం డబుల్ రోల్ లో కనిపించి అదరగొట్టాడు.
'క' మూవీ స్టోరీ..
అభినయ్ వాసుదేవ్ అనే అనాథ ఆశ్రమంలో జీవిస్తూ ఉంటాడు. ఇతరులకు వచ్చిన ఉత్తరాలను చదువుతూ.. వారిని తన సొంత వాళ్లుగా ఊహించుకుంటాడు. ఈ క్రమంలో కొందరికి అతడే సమాధానాలు ఇస్తుంటాడు. ఈ అలవాటు రాను రాను వాసుదేవ్‌కి ఆసక్తిగా మారుతుంది. దీంతో పోస్ట్ మ్యాన్ అయితే ఎన్నో ఉత్తరాలు చదవోచ్చు అనుకుంటాడు. అందుకే కృష్ణగిరి అనే గ్రామానికి వెళ్లి అక్కడ అసిస్టెంట్ పోస్ట్ మ్యాన్ ఉద్యోగంలో చేరతాడు.
ఈ క్రమంలో వాసుదేవ్ జీవితాన్ని ఓ ఉత్తరం మార్చేస్తుంది. గ్రామంలో ఆడవాళ్లు మిస్ అవ్వడానికి.. ఆ ఉత్తరానికి లింకు ఏంటి ? వారిని వాసుదేవ్ పట్టుకున్నాడా ? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మూవీ స్టోరీ. క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ లతో ఆడియన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు.












Click it and Unblock the Notifications