అర్జున్ రెడ్డి 'ముద్దు' రికార్డు బద్దలు కొట్టేశాడు భయ్యా..!
చిత్రసీమలో మారుతున్న కాలాన్ని బట్టి సినిమాలు, స్టోరీలు మారుతూ వస్తున్నాయి. గత దశాబ్దం నుంచి మితిమీరిన రొమాన్స్, వైలన్స్ మూవీలో కామన్ అయిపోయాయి. అప్పట్లో బాలీవుడ్ లో ఎక్కువగా కనిపించే రొమాంటిక్ సీన్స్, ముద్దు సీన్స్ ప్రస్తుతం అన్ని భాషల్లోని మూవీస్ లో కనిపిస్తున్నాయి. ఇక టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీలోని ముద్దు సీన్స్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అప్పటివరకు తెలుగు సినిమాలో అన్ని ముద్దు సీన్స్ ఉండటం రేర్ గా చెప్పొచ్చు. కానీ ఆ తర్వాత చాలా సినిమాల్లో ఇలాంటి సీన్లు కనిపించాయి.
అయితే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం కే ర్యాంప్ అనే మూవీ చేస్తున్నాడు. ఇటీవల క మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ మరో విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. అక్టోబర్ 16న ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కిరణ్ అబ్బవరం హీరోయిన్ తో ఏకంగా 16 సార్లు లిప్ లాక్ చేశాడని అంటున్నారు. కథ బలంగా డిమాండ్ చేయడంతో తప్పలేదని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది.

కిరణ్ అబ్బవరం గత సినిమా 'క' సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కె ర్యాంప్ అనే టైటిల్ తో సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. 'క' సెంటిమెంట్ తో ఈ సినిమా కూడా హిట్ అవుతుందన్న నమ్మకంతో కిరణ్ అబ్బవరం ఉన్నాడు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పాత్ర గత సినిమాల కంటే విభిన్నంగా ఉంటుందని సమాచారం. ఇక కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయట. ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా బోల్డ్ గా ఉంటారని సమాచారం అందుతోంది. ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కు సిద్ధం అయింది.












Click it and Unblock the Notifications