తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. సీమంతం ఫొటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఆయన సతీమణి, హీరోయిన్ రహస్య గోరఖ్ సీమంతం తాజాగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన పిక్స్ కిరణ్ అబ్బవరం తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేశాడు. అవి వైరల్ అయ్యాయి. అంతేకాక ఆమె బేబీ బంప్ ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ మేరకు ఈ జంటకు నెటిజెన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.
కిరణ్ అబ్బవరం 2019లో రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఎస్ఆర్ కల్యాణమండపం, సెబాస్టియన్ పి, వినరో భాగ్యము విష్ణు కథ.. లాంటి చిత్రాల్లో నటించాడు. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన క చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా రావడం విశేషం. ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుంది. అందుకే ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక 2019లో రిలీజైన రాజావారు రాణిగారు సినిమాతోనే నటి రహస్య తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాతోనే కిరణ్- రహస్యల మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ 2024లో వివాహం చేసుకున్నారు. ఇక క సినిమాతో సూపర్ కొట్టిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత దిల్ రూబా అనే సినిమా చేశాడు. కానీ అది డిజాస్టర్ అయింది. ప్రస్తుతం K-Ramp అని మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో సిద్దమవుతున్నాడు కిరణ్ అబ్బవరం.
అయితే ప్రస్తుతం బేబీ బంప్ తో ఉన్న రహస్య ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పండంటి బిడ్డకు జన్మ నివ్వాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరో నాలుగు నెలల్లో ఆమె తల్లి కాబోతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications