ఫాంహౌస్‌కి వస్తే రూ.25 లక్షలు ఇస్తానన్నారు - టాలీవుడ్ బ్యూటీ

తెలుగు ప్రేక్షకులకు కిర్రాక్ సీతగా పరిచయమైంది నటి సుప్రజ. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించి.. సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సినిమాలు, బిగ్‌బాస్ వరకు ఎదిగిన ఆమె తాజాగా సినీ పరిశ్రమలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఒక నిర్మాత ఫామ్‌హౌస్‌కు రావాలని ఒత్తిడి చేశాడని ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

కాగా చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి ఉన్న ఆమె కూచిపూడి, భరతనాట్యం వంటి నృత్యాల్లో శిక్షణ పొందింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె చదువుతో పాటు స్వయంగా ట్యూషన్లు చెప్పి ఆర్థికంగా నిలబడేందుకు ప్రయత్నించేది. ఆ తర్వాత 7 ఆర్ట్స్ సరయూతో కలిసి యూట్యూబ్ లో చేసిన బోల్డ్, ఫన్నీ వీడియోల ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన పాపులారిటీతో ఆమె పేరు యువతలో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత వెబ్ కంటెంట్, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మరింత ఫాలోయింగ్ సంపాదించింది.

kirrak-seetha-alias-actress-supraja-shocking-comments-about-casting-couch-and-producer-offer

'బేబీ' సినిమాతో భారీ గుర్తింపు..

ఇక కిర్రాక్ సీతకు అసలు బ్రేక్ ఇచ్చింది 'బేబీ' సినిమా. ఈ చిత్రంలో ఆమె చేసిన నెగటివ్ షేడ్ పాత్ర ప్రేక్షకులపై బలమైన ప్రభావం చూపింది. ఆ పాత్రలో ఆమె నటన అంత న్యాచురల్‌గా ఉండటంతో కొంతమంది ప్రేక్షకులు నిజంగానే ఆమెను ద్వేషించేంతగా స్పందించారు. సినిమా విడుదల తర్వాత సోషల్ మీడియాలో తనకు తీవ్ర ట్రోలింగ్ ఎదురైందని, కొందరు బెదిరింపు మెసేజ్‌లు కూడా పంపారని ఆమె గతంలో వెల్లడించింది.

బిగ్‌బాస్‌తో పాపులారిటీ..

సినిమాల తర్వాత కిర్రాక్ సీతకు వచ్చిన మరో పెద్ద అవకాశం బిగ్‌బాస్. హౌస్‌లో ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్, ధైర్యంగా మాట్లాడే తీరు, టాస్కుల్లో ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కారణంగా బలమైన కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందింది. సుమారు 40 రోజుల పాటు హౌస్‌లో కొనసాగిన ఆమె ఎలిమినేషన్ సమయంలో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో "అన్యాయంగా ఎలిమినేట్ చేశారు" అంటూ పెద్ద ఎత్తున పోస్టులు కూడా వచ్చాయి.

ఇక ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కిర్రాక్ సీత తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది. 7 ఆర్ట్స్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి సినిమా అవకాశం ఉందని చెప్పాడని వెల్లడించింది. అప్పుడు తన వయసు కేవలం 21 సంవత్సరాలేనని, సినిమా చేస్తానని చెప్పగానే ఫామ్‌హౌస్‌కు రావాలని ఆ వ్యక్తి కోరాడని సీత తెలిపింది. "ఆఫీస్ ఉంటే అక్కడికి వస్తాను.. ఫామ్‌హౌస్‌కు ఎందుకు?" అని తాను ప్రశ్నించానని చెప్పింది. అయితే టీమ్ మొత్తం అక్కడే ఉందని చెప్పడంతో మొదట కొంత కన్ఫ్యూజ్ అయినా, చివరకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు వివరించింది.

"రూ.25 లక్షలు" ఆఫర్..

ఫామ్‌హౌస్‌కు వెళ్లకపోవడంతో ఆ రోజు వచ్చిన కాల్స్‌ను తాను లిఫ్ట్ చేయలేదని సీత తెలిపింది. రెండు మూడు రోజుల తర్వాత మళ్లీ కాల్ చేసి ఎందుకు రాలేదని అడిగారని, తనకు అది కరెక్ట్‌గా అనిపించలేదని చెప్పానని వెల్లడించింది. దానికి ఆ వ్యక్తి "మీకు రూ.25 లక్షలు ఇస్తారు" అని చెప్పాడని, వెంటనే తాను "నో" చెప్పేశానని సీత వెల్లడించింది. డబ్బు కోసం అలాంటి పనులు చేయలేనని స్పష్టంగా చెప్పానని పేర్కొంది. ఇలాంటి కాల్స్ తరచూ వస్తూనే ఉంటాయని.. సినిమా అవకాశాల పేరుతో యువతులను మోసం చేయడానికి ప్రయత్నిస్తారని ఆమె పేర్కొంది. మొత్తానికి కిర్రాక్ సీత చేసిన ఈ వ్యాఖ్యలతో మరోసారి టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+