కోకాపేట్‌లో అల్లు అర్జున్ థియేటర్: ఫీచర్స్ మైండ్ బ్లోయింగ్.!!
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత వినే ఉంటాం. ఇది కచ్చితంగా మన సినిమా స్టార్స్‌కు వర్తిస్తుంది. అందుకే మాంచి ఫామ్‌లో ఉండగానే ఇతర వ్యాపారాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతుంటారు. ఈ ఫార్ములా ఒక్క సినిమా స్టార్స్‌కే కాదు క్రికెటర్స్ ఇతర సెలబ్రిటీలు కూడా ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అవుతున్నారు. ఇక సినిమా స్టార్స్ విషయానికొస్తే ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాణ సంస్థలు స్థాపించి సినిమాలను వారే స్వయంగా నిర్మిస్తుంటారు. కొందరు సక్సెస్ కాగా.. మరికొందరికి వర్కౌట్ కాలేదు.
దీంతో చాలామంది సినిమా థియేటర్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు గచ్చిబౌలిలోని శరత్ సిటీలో ఏఎంబీ థియేటర్స్ స్థాపించగా అమీర్‌పేట్‌లో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ AAA సినిమాస్ స్థాపించాడు. తాజాగా బన్ని మరో థియేటర్‌ను కోకాపేట్‌లో నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కోకాపేట్‌లో వరల్డ్ క్లాస్ థియేటర్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే అమీర్‌పేట్‌లో AAA సినిమాస్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్న బన్నీ ఇప్పుడు మరో థియేటర్‌తో ఫ్యాన్స్ ముందుకు వస్తున్నాడు.కోకాపేట్‌లో ఈ అల్లు సినీప్లెక్స్ సిద్ధమవుతోంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోకాపేట్‌లాంటి ప్రాంతంలో ఈ అల్లు సినీప్లెక్స్ రావడం విశేషం. ఈ థియేటర్ ప్రారంభంపై తాజాగా ఓ బిగ్ అప్‌డేట్ వచ్చింది.
కోకాపేట్‌లో అల్లు సినీ ప్లెక్స్
కోకాపేట్‌లో అల్లు సినీప్లెక్స్ వచ్చే ఏడాది అంటే 2026 సంక్రాంతికి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇది హైదరాబాద్‌లోనే తొలి డాల్బీ సినిమా అనుభూతిని ప్రేక్షకుడికి కలిగిస్తుంది.ఈ థియేటర్‌లో కనిపించే విజువల్స్, సౌండ్ సిస్టంలు దేశంలో అతి తక్కువ థియేటర్లలో ఉన్నాయి.హైదరాబాదులో మాత్రం ఇలాంటి అత్యాధునిక ఫీచర్స్ ఉన్న తొలి థియేటర్‌గా అల్లు సినీప్లెక్స్ నిలవనుంది. ఈ థియేటర్ ప్రారంభమైతే సినిమా లవర్స్‌కు ఒక చక్కటి అనుభూతిని అందిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఓఆర్ఆర్ నివాసులకు మూవీ హబ్
అల్లు సినీప్లెక్స్ అల్లు కుటుంబానికి చెందిన కోకాపేట భూముల్లో నిర్మిస్తున్నారు. ఇక్కడే అల్లు స్టూడియోస్ కూడా ఉంది.అల్లు స్టూడియోస్ రెండేళ్ల క్రితం ప్రారంభమైంది. ఇప్పుడు అల్లు థియేటర్ నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం కోకాపేట్,గండిపేట్ పరిసర ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ బడా మల్టీప్లెక్స్‌లు ఏవీలేవు. ఇక ఈ ప్రాంతంలో నివసిస్తున్నవారు సినిమా చూడాలంటే గచ్చిబౌలిలోని మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ లేదా పీవీఆర్ థియేటర్స్‌కు వెళుతున్నారు.ఇక అల్లు సినీప్లెక్స్ ప్రారంభమైతే మరొక మూవీ హబ్ తయారవుతుంది. ఓఆర్ఆర్ పరిసరాల్లో నివసిస్తున్న వారికి సినిమా చూసేందుకు ఇదొక మంచి ఆప్షన్ అవుతుంది.
ఇదిలా ఉంటే పుష్ప-2తో మాసివ్ హిట్ కొట్టిన బన్నీ.. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ పై ఫోకస్ చేస్తున్నారు. ప్రముఖ తమిళ డైరెక్టర్ అట్లీ డెరెక్ట్ చేస్తున్న AAA22XA6 చిత్ర షూటింగ్‌లో ఉన్నారు. సైంటిఫిక్-ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టెయినర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా బన్నీ బాక్సాఫీస్‌ను మరోసారి బద్దలు కొడుతారనే ప్రచారం ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఫ్యాన్స్‌కు మళ్లీ పూనకాలు తెప్పిస్తుందనే టాక్ వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications