కోలీవుడ్ స్టార్ హీరో కాపురంలో చిచ్చుపెట్టిన లేడి సింగర్..
కోలీవుడ్ స్టార్ హీరో జయంరవి, భార్య ఆర్తీ ఇటీవలే విడాకులకు సిద్ధమవుతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే, ఈ విడాకులకు కారణం ప్రముఖ లేడి సింగర్ అని తెలుస్తోంది. నటుడు జయంరవి కాపురంలో లేడి సింగర్ చిచ్చుపెట్టినట్లు వార్తలొస్తున్నాయి. ఆమె కారణంగానే హీరో జయంరవి, ఆర్తీ విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
నటుడు జయంరవి, ఆర్తీ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆర్తీ ధనవంతుల కుటుంబానికి చెందినది. వీరికి ఇద్దరు కుమారులు. పెళ్లయిన చాలాయేళ్లకు వీరిద్దరూ విభేదాల కారణంగా విడాకులకు సిద్ధమవుతున్నట్లు ఇటీవలే వార్తలు వస్తున్నో సంగతి తెలిసిందే. అయితే, ఆర్తి తన విడాకుల నిర్ణయం గురించి ప్రకటించేలోపే నటుడు జయం రవి ఒక అడుగు ముందుకు వేసి విడాకుల నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవలే వీరిద్దరూ చెన్నై కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం దాఖలు చేసినట్లు సమాచారం. అయితే, వీరి విడాకులకు కారణం ఓ లేడి సింగర్ అన్నట్లు తెలుస్తోంది. జయంరవికి సింగర్‌కు ఉన్న పరిచయాల వల్లే ఆర్తీ అతనితో విడాకులకు సిద్దమయినట్లు వార్తలొస్తున్నాయి.

ఇది తన నిర్ణయమే..
విడాకుల ప్రకటన అనంతరం ఆర్తీ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. జయం రవి నిర్ణయం తర్వాత తాను, తన పిల్లలు ఏం చేయాలో తోచని స్థితికి వెళ్లిపోయామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా పూర్తిగా రవి సొంత నిర్ణయమేనని ఆమె తెలిపారు. తన పిల్లలకు తల్లిగా నిలబడే సమయం వచ్చిందని పోస్ట్ లో పేర్కొన్నారు. ఆర్తి సోషల్ మీడియాలో జయం రవితో కలిసి దిగిన ఫోటోలని కూడా తొలగించారు.
కుటుంబానికి దూరంగా...
జయం రవి భార్యతో విడాకులు తీసుకోవడానికి కారణం గాయని కెనీషాతో అతని సంబంధమే అని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. జయం రవి షూటింగ్ నుంచి బ్రేక్ లభించగానే అతను గోవాకు వెళ్లేవాడని, తన ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేవాడు కాదని సమచారం. అదేవిధంగా, జూన్ 4వతేదిన జయం రవి, ఆర్తిల పెళ్లిరోజు. అయితే, ఆ సమయంలో కూడా జయం రవి ఆర్తితో, తన ఫ్యామిలీతో కలసి లేడని తెలుస్తోంది. వీటన్నీంటికి గాయని కేనీషా కారణమని తెలుస్తోంది. జూన్ 24న, జయం రవి ఉపయోగిస్తున్న కారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిందని ఆర్తీ ఫోన్‌కు మెస్సేజ్ వచ్చింది. దీంతో ఎక్వరీ చేయగా, ఆ కారును కెనీషా నడుపుతున్నట్లు తేలింది. అప్పటికే పలు విషయాల్లో జయం రవిపై కోపంగా ఉన్న ఆర్తి, తన భర్తతో దిగిన ఫోటోలన్నింటినీ తొలగించిందట. అంతేకాదు, ఆమె నేరుగా గోవా వెళ్లి ఆరా తీస్తే,, జయం రవి సింగర్ కెనీషాతో కలిసి విలాసవంతమైన బంగ్లా కొనుగోలు చేసి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడని తెలిసింది. అయితే, ఈవార్తలు ఇంకా నిర్థారణ కాలేదు. నటుడు జయంరవి విడాకుల కారణం మాత్రం లేడి సింగరే అని వార్తలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications