ధూమ్-4లో కోలీవుడ్ స్టార్ హీరో.. ఈ వార్తలో నిజమెంతా..?
బాలీవుడ్‌లో వరుసగా వచ్చిన 'ధూమ్' సిరీస్ చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. ఇక, తాజాగా ధూమ్ 4 చిత్రానికి రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించిన మరో న్యూస్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈసారి ధూమ్ సిరీస్‌లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదికూడా నటుడు సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారట.. ప్రస్తుతం ఈ న్యూస్ కాస్త సోషల్‌మీడియాలో తెగ హాల్చల్ చేస్తోంది.
బాలీవుడ్‌లో 2004లో వచ్చిన ధూమ్ చిత్రాలు భారీ సక్సెస్‌ను అందుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన మూడు సీక్వెల్స్ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ ఫ్రాంఛైజీలోనే ప్రేక్షకులను అలరించేందుకు మరోసారి ధూమ్ సిరీస్ రానుంది. ఈసారి 'ధూమ్ 4' పట్టాలెక్కనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ మేరకు సన్నాహాలు కూడా చేస్తున్నట్లు సమాచారం. 'ధూమ్, పార్ట్ 2, 3'లకు కథను అందించిన ఆదిత్య చోప్రానే ధూమ్ 4కి కూడా పని చేస్తున్నట్లు బీ టౌన్ వర్గాల్లో టాక్. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు అనుగుణంగా భారీ స్థ్థాయిలో ఈ సినిమాను ప్లాన్ చేసేందుకు నిర్మాతలు ప్రణాళికలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది.

ప్రతినాయకుడి పాత్రలో...
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ సినిమాలో ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో సూర్య నటించనున్నారని బీ టౌన్ వర్గాల్లో వినిపిస్తున్నన్యూస్. ఇక, ఈ విషయంపై చిత్ర యూనిట్ ఇప్పటికే సూర్యను కూడా సంప్రదించారట. ఈ పాత్రలో నటించేందుకు ఆయన కూడా ఆసక్తి చూపారని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అటు చిత్ర యూనిట్ కానీ, నటుడు సూర్య కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. సూర్య ఫ్యాన్స్ అంతా అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. అయితే విలన్ పాత్రలు చేయడం నటుడు సూర్యకు కొత్తేమీ కాదు. గతంలో రెండు చిత్రాల్లో ప్రతినాయకుడి రోల్ లో కనిపించారు.












Click it and Unblock the Notifications