Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు భయ్యా.. నాగవంశీకి ఊపిరి పోసింది..

సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు అని మరోసారి రుజువైంది. ఇటీవల మహావతార్ నరసింహ కేవలం మౌత్ టాక్ తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. రూ. 15 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఇండియన్ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా నిలిచింది. అయితే తాజాగా మరో మూవీ ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. మలయాళం నుంచి వచ్చిన ఈ మూవీ తెలుగు ఆడియన్స్ కు విపరీతంగా ఎక్కేస్తుంది. సినిమా కంటెంట్, టేకింగ్ బాగుంటే ఏ ఇండస్ట్రీ మూవీ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది.

ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కు చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన కొత్త లోక చాఫ్టర్ట్ 1 మూవీ ఆగస్టు 29న తెలుగులో విడుదలైంది. ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శని నటించింది. ఈ సినిమా కొత్త లోక సినిమాటిక్ యూనివర్స్ భాగంగా తొలి మూవీగా వచ్చింది. భారతీయ సినిమా చరిత్రలో సూపర్ హీరో తరహా చిత్రాలు రావడమే తక్కువే. అలాంటిది భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా కొత్త లోక చాఫ్టర్ 1' తో దూసుకెళ్తోంది. మూవీలో కళ్యాణి ప్రియదర్శని నటన కెరీర్ బెస్ట్ అనే ప్రేక్షకులు అంటున్నారు.

Kotha Loka Chapter 1 Wins Big Telugu Version Grosses Over 5 Crore in 4 Days

ఇక టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగవంశీకి ఇటీవల దెబ్బ మీద దెబ్బ పడింది. రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్.. అంతకుముందు వచ్చిన రెట్రో చిత్రం ప్లాఫ్ అయ్యాయి. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 మూవీతో చావు దెబ్బ తిన్నాడు నాగవంశీ. ఇన్ని వరుస ఫ్లాప్స్ తో డీలా పడిన నాగవంశీ ఈ మూవీతో ఒక మలయాళం డబ్బింగ్ సినిమాతో మళ్లీ సేఫ్ అయ్యాడు. కొత్త లోక చిత్రానికి అసలు ప్రొమోషన్స్ చేయలేదు. అయినప్పటికి మౌత్ టాక్ తో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ గా తెలుగు వెర్షన్ లో నిల్చింది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ చిత్రానికి నాలుగు రోజులకు కలిపి తెలుగు వెర్షన్ లో రూ. 5 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందట. ఈ చిత్రాన్ని నిర్మాత నాగవంశీ కేవలం రూ. 2 కోట్లకే కొనుగోలు చేసాడట. ఫుల్ రన్ లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+