'కుబేర' రివ్యూ.. బొమ్మ బ్లాక్ బ్లాస్టర్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'కుబేర' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో శేఖర్ కమ్ముల తనదైన శైలిలో కథలను ఎంచుకుంటూ విజయాలు సాధిస్తున్నారు. ఈ సినిమా కూడా ఆయన దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టింది.

కథ:
దీపక్ (నాగార్జున) అనే మాజీ సీబీఐ అధికారి, తాను చేసే ఒక కీలక ఆపరేషన్‌లో దేవా (ధనుష్) అనే బిచ్చగాడితో కలిసి పని చేయాల్సి వస్తుంది. అసలు దీపక్ ఎందుకు దేవాను ఎంచుకున్నాడు? వారిద్దరి ప్రయాణంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? అన్నది కథాంశం.

Kubera movie telugu review and rating

విశ్లేషణ:
శేఖర్ కమ్ముల తాను చెప్పదలచుకున్న కథాంశాన్ని చాలా సూటిగా, స్పష్టంగా తెరకెక్కించారు. సినిమా ప్రారంభంలోనే కథ యొక్క సారాంశం అర్థమవుతుంది. దాదాపు రెండున్నర గంటల నిడివి ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆసక్తిగా చూసేలా చేయడంలో దర్శకుడు కొంతవరకు విజయం సాధించారు. ధనుష్ నటన ఈ సినిమాకు ప్రాణం పోసిందని చెప్పొచ్చు. బిచ్చగాడి పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసి, తన కెరీర్‌లో మరొక అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చారు. ఆ పాత్రలో ధనుష్ కాకుండా మరెవరూ అంతగా ఒదిగిపోయి నటించలేరనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాతో ధనుష్ మరో నేషనల్ అవార్డు కొట్టిన ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

Kubera movie telugu review and rating

ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, సెకండాఫ్ మొత్తం ధనుష్ పాత్ర చుట్టూ అల్లుకుని, కథను ముందుకు నడిపించింది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ధనుష్ చెప్పే సంభాషణలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం భావోద్వేగ సన్నివేశాలకు బలాన్ని చేకూర్చింది. నాగార్జున సీబీఐ ఆఫీసర్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నారు, సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచారు. రష్మిక మందన్న కూడా తన పాత్రకు న్యాయం చేసింది.

అయితే, సినిమాలోని మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ప్రారంభంలోనే కథ మొత్తం చెప్పేయడం వల్ల మిగిలిన నిడివి ప్రేక్షకులను హోల్డ్ చేయడంలో కొంత ఇబ్బంది పడింది. స్క్రీన్‌ ప్లేలో మార్పులు చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఫస్టాఫ్ కొన్ని చోట్ల సాగదీసినట్లు అనిపించడం, విలన్ పాత్రకు సరైన ఎలివేషన్ లేకపోవడం, కథ ఒకే పాయింట్ చుట్టూ తిరగడం వంటివి కొంత ప్రతికూలంగా మారాయి.

ముగింపు:
మొత్తంగా, 'కుబేర' ధనుష్ నటన, దర్శకత్వం, సంగీతం ప్రధాన బలాలతో కూడిన ఒక విభిన్న చిత్రం. శేఖర్ కమ్ముల తనదైన ముద్రతో ఒక మంచి ప్రయత్నం చేశారు. థియేటర్లలో చూసి ఆస్వాదించదగిన సినిమా ఇది.

రేటింగ్:3/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+