నా కన్నా చిన్నవాడే.. కానీ మగతనం ఎక్కువే..ఆ హీరోపై నటి షాకింగ్ కామెంట్స్

సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. బాలీవుడ్‌లో ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్‌ చేసి, మరొకర్ని వివాహం చేసుకున్న వారే.మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు.

తాజాగా ఓ నటి తన జీవితంలో ఎదురైన అనుభవాలు గురించి వెల్లడించింది. ఆ నటి మరెవరో కాదు కునిక సదానంద్‌ లాల్‌. బాలీవుడ్ నటిగా, పాప్‌ గాయని, బిజినెస్‌ ఉమెన్‌ ఇలా ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా కునిక సదానంద్‌ లాల్‌‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా ఈమె తాజాగా సిద్ధార్థ్‌ కన్నన్‌ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆ షో లొ ఆమె చాలా ఓపెన్ అయ్యారు గాయకుడు కుమార్‌ సానుతో తన ప్రేమ వ్యవహారం గురించి అంతేకాదు బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ పలువురు హీరోయిన్లతో నడిపిన వ్యవహారాల గురించి అన్ని విషయాలను ఆమె ఓపెన్‌గా మాట్లాడారు.

Kunickaa Sadanand Lal comments on Akshay Kumar go viral

అక్షయ్ కుమార్ చాలా హ్యాండ్సమ్‌గా , ఫిట్‌గా ఉన్నారని, అంతేకాకుండా అతను తన కంటే ఒక సంవత్సరం చిన్నవాడని అన్నారు.ఆమె పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు ఎక్కువగా ఉంటే ఫిట్‌గా ఉంటారని, దానివల్ల మహిళలకు ఆకర్షణ కలగడం సహజమని కూడా వ్యాఖ్యానించారు. అక్షయ్ కుమార్‌కు చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్స్ ఉండటానికి ఇదే కారణం కావచ్చని ఆమె పరోక్షంగా అన్నారు. అంటే మగతనం ఎక్కువైతే ఫిట్నెస్ దాంతో ఆడవాళ్ళ కు ఆకర్షణ కలగడం.. వల్ల ఇలాంటి ఎఫైర్స్‌ పుట్టుకొస్తాయన్నట్టుగా అభిప్రాయపడ్డారు. కునిక సదానంద్‌ లాల్‌ గతంలో నటుడు కుమార్ సానుతో తనకున్న సంబంధం గురించి కూడా బహిరంగంగా మాట్లాడారు.

ఆమె కుమార్ సానుతో తనకు ఆరేళ్లపాటు సంబంధం ఉందని వెల్లడించారు. ఆ సమయంలో కుమార్ సాను తన మొదటి భార్య రీటా భట్టాచార్యతో సఖ్యతగా లేరని, చాలా బాధలో ఉండేవారని కునిక తెలిపారు.కుమార్ సాను తన వివాహ బంధంలో సంతోషంగా లేనందువల్లే తనకు దగ్గరయ్యారని కునిక చెప్పారు. అంతేకాకుండా, కుమార్ సాను ఒకసారి మద్యం మత్తులో హోటల్ కిటికీ నుండి దూకడానికి ప్రయత్నించారని, తాను , ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ని ఆపాల్సి వచ్చిందని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు.

కుమార్ సానుకు తన పిల్లల పట్ల బాధ్యత ఉందని గుర్తు చేయడంతో వారి బంధం మరింత బలపడిందని కునిక తెలిపారు. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత వారిద్దరూ విడిపోయారు. కుమార్ సాను తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత సలోని భట్టాచార్యను వివాహం చేసుకున్నారు. కునిక సదానంద్ బహిరంగంగా తన గత సంబంధం గురించి మాట్లాడటం అప్పట్లో కొంత చర్చనీయాంశమైంది. ఆమె నిజాయితీని కొందరు మెచ్చుకోగా, మరికొందరు ఆమె వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+