ఐ బొమ్మలోకి దూసుకొచ్చిన రూ. 300 కోట్ల సినిమా
ఐ బొమ్మ అనేది తెలుగు సినిమాలను ఆన్‌లైన్‌లో చూడడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రముఖ వెబ్‌సైట్ అనే విషయం అందరికి తెలిసిందే. ఇది తాజా తెలుగు సినిమాల నుండి క్లాసిక్ హిట్స్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది. అయితే, ఇది చట్టవిరుద్ధమైన వెబ్‌సైట్ అని గమనించాలి. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ, అధికారిక అనుమతి లేకుండా సినిమాలను ప్రసారం చేస్తుంది.
ఐ బొమ్మ ద్వారా తాజా బ్లాక్ బస్టర్‌లు, క్లాసిక్ హిట్స్, చిన్న సినిమాలు వంటి అన్ని రకాల తెలుగు సినిమాలను ఒకే చోట చూడవచ్చు. దీని ద్వారా ఎటువంటి చెల్లింపులు లేకుండా సినిమాలను ఉచితంగా చూడవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అనుమతిస్తుంది.సినిమాలను డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో కూడా చూడవచ్చు. తాజాగా ఐ బొమ్మలో సూపర్ హిట్ సినిమా అందుబాటులోకి వచ్చింది.

ఆ సినిమా మరెదో కాదు..'లోకా చాప్టర్ 1: చంద్ర'.భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కిన 'లోకా చాప్టర్ 1: చంద్ర' ..బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్టు 28న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ఏకంగా 50 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ కె. గఫూర్ ప్రధాన పాత్రల్లో డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఐ బొమ్మలో ప్రత్యక్షం అయింది.
గమనిక: ఐ బొమ్మకు వన్ ఇండియా తెలుగు వెబ్‌సైట్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఐ బొమ్మను ఏ విధం గాను వన్ ఇండియా తెలుగు వెబ్‌సైట్ ప్రోత్సహించడం లేదు. కేవలం ఐ బొమ్మలో వచ్చే ఆప్‌డేట్స్‌ను మాత్రమే అందించడం జరుగుతోంది.












Click it and Unblock the Notifications