డ్రెస్‌ సైజ్ తగ్గిస్తానంటున్నా వాళ్లే వద్దంటున్నారు..రష్మి బోల్డ్ కామెంట్స్

బుల్లితెర యాంకర్ రష్మి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మి.. సినిమాల్లో సరైన అవకాశాలు దొరక్కపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది. జబర్థస్త్ షోలో యాంకర్‌గా కనిపించిన తరువాత రష్మి జాతకమే మారిపోయింది. జబర్థస్త్ షో రష్మికి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా రష్మి -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.

టీవీ రంగంలో రష్మి -సుడిగాలి సుధీర్‌లపెయిర్ సంచలనం సృష్టించారని అని చెప్పాలి. వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్‌కి వెళ్లిపోయిందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో రష్మి పలు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా అవకాశాలు దక్కించుకుంది. యాంకర్ రష్మి ఇటీవల కాలంలో నిత్యం వార్తాల్లో నిలుస్తున్నారు. లేటెస్ట్ ఫొటో షూట్‌లతో పాటు, తన కామెంట్స్‌తో రష్మి పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది.

latest jabardasth promo viral on anchor rashmi dressing size

ఇక జబర్దస్త్ షో ఒకటైన సంగతి అందరికి తెలిసిందే.గతంలో జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ రెండు షోలు ప్రసారం అయ్యేవి. అయితే షోకు రేటింగ్స్ భారీగా పడిపోవడంతో ఎక్స్ట్రా జబర్దస్త్‌ను నిలిపి వేస్తున్నట్టు నిర్వహుకులు ప్రకటించారు. దీంతో జబర్దస్త్ షో ఒక్కటి మాత్రమే ప్రసారం అవుతోంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. అందులో రష్మి డ్రెస్‌ సైజ్‌ తగ్గించాలి అనే డిమాండ్‌ ఉండటం విశేషం.

మహిళలే ఆ ప్లకార్డులు ప్రదర్శించారు. దీన్ని జడ్జ్ కృష్ణభగవాన్‌ ప్రదర్శించారు. రష్మి డ్రెస్‌ తగ్గించాలని తాము డిమాండ్‌ చేస్తున్నట్టు తెలిపారు. దీంతోపాటు ఎక్స్ ట్రా జబర్దస్త్ మళ్లీ రావాలని, సన్నీకి పెళ్లి అవుతుందా అనే ప్లకార్డులు కూడా ఉండటం విశేషం. తన డ్రెస్‌కి సంబంధించిన డిమాండ్‌పై రష్మి స్పందించింది. తాను కూడా అదే చెబుతున్నా అని, తగ్గిస్తానంటే వద్దంటున్నారంటూ పెద్ద షాకిచ్చింది రష్మి. తనకు డ్రెస్‌ సైజ్‌ తగ్గించాలని ఉన్నా, షో నిర్వహకులు వద్దు అంటున్నారనే అర్థంలో రష్మి గౌతమ్ ఆవేదన చెందింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రొమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+