‘ఐబొమ్మ’లో నిన్న విడుదలైన కొత్త సినిమాలన్నీ వచ్చేశాయి
తెలుగులో ఐబొమ్మ, మూవీరూల్జ్ లాంటి పైరసీ వెబ్ సైట్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఎప్పుడైతే నిర్మాతలు ప్రభుత్వాల దగ్గరకు వెళ్లి అధిక రేట్లకు అనుమతులు తెచ్చుకొని, టికెట్ ధరలు పెంచారో అప్పటి నుంచి ఇలాంటి సైట్లకు ఆదరణ పెరుగుతోంది. ఖర్చుపెట్టగలిగే స్థాయిలో థియేటర్లలో టికెట్ ధరలు ఉంటే కుటుంబాలతో సహా వెళ్లి చూడటానికి సినీ ప్రియులంతా సిద్ధంగా ఉంటారు. కానీ మొదటి రెండువారాలు అత్యంత దారుణంగా రూ.500 నుంచి రూ.వెయ్యి, రూ.1200 ఉంటే ఎవరు చూస్తారు. నలుగురున్న కుటుంబ సభ్యులంతా వెళ్లాలంటే రూ.5వేలు అవుతోంది. అందుకే వారంతా ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు.
అంతం లేని వినోదం అందుబాటులో
మూవీ రూల్జ్ లో సినిమా విడుదలైన మొదటిరోజే డీవీడీ ప్రింట్ తో సినిమాలు వచ్చేస్తున్నాయి. కొద్దిరోజులు ఆగిన తర్వాత హెచ్ డీ ప్రింట్ వస్తోంది. అయితే ఐబొమ్మలో అన్నీ హెచ్ డీ ప్రింట్లే ఉంటాయి. ఓటీటీల్లో సినిమా టెలికాస్ట్ అయిన తర్వాత ఆ ప్రింట్ ను వారు పెడుతున్నారు. దీంతో కొంతమంది కాస్తంత ఆలస్యమైనా ఐబొమ్మలో చూస్తున్నారు. సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లు కూడా ఉండటంతో వారి వినోదానికి అంతులేకుండా పోతోంది. ఇటువంటి సైట్లను బ్యాన్ చేయాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారుకానీ వారివల్ల కావడంలేదు.

ఇదే బెటర్ అంటున్న నెటిజన్లు
తాజాగా ఐబొమ్మలో నితిన్ హీరోగా వచ్చిన రాబిన్ హుడ్ సినిమా ఉంది. దీంతోపాటు నయనతార, మాధవన్, సిద్ధార్థ నటించిన టెస్ట్ సినిమా, ధనుష్ దర్శకత్వం వహించిన జాబిలమ్మ నీకు అంత కోపమా, నాని నిర్మాతగా తీసిన కోర్ట్, బాలీవుడ్ లో సంచలన విజయాన్ని సాధించిన చావా, మ్యాడ్2, ఎంపురాన్ తదితర సినిమాలన్నీ అందుబాటులోకి వచ్చేశాయి. సినిమాలను నేరుగా చూడటంతోపాటు డౌన్ లోడ్ కూడా చేసుకొని చూసే సదుపాయం ఉండటంతో ఎవరికి తోచినట్లుగా వారు సినిమాలు చూస్తున్నారు. థియేటర్ లో చూసినంత భావన లేకపోయినప్పటికీ చేతిలో డబ్బులు వదిలించుకునేబదులు ఇదే మంచిదికాదా అని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications