Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Little Hearts Movie: నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ..!

ఒకప్పుడు పెద్ద సినిమా అంటే కంటెంట్ ఉంటుంది. ఆసక్తికరంగా ఉంటుంది. పైసా వసూల్ మూవీ, ఫుల్ టైమ్ పాస్ మూవీ ఇలాంటి మాటలు వినపడేవి. కానీ ఇప్పుడు చిన్న సినిమాకు ఇలాంటి మాటలు వినపడుతున్నాయి. పెద్ద సినిమాల మధ్యలో వచ్చిన ప్రతి చిన్న సినిమా హిట్ అవుతోంది. అంటే అర్థం ఏంటి.. పెద్ద సినిమాల్లో కంటెంట్ లేదని అర్థం అవుతోంది.

తాజాగా బాక్సాఫీస్ ముందు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి ఘాటి, మదరాసి.. ఘాటిలో అనుష్క లీడ్ పాత్రలో నటించింది. ఈ మూవీకి క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ప్రేక్షకులు తిరస్కరించారు. అనుష్క యాక్టింగ్ బానే ఉన్నప్పటికీ డైరెక్షన్, స్క్రీన్ ప్లే పోయిందని టాక్ వినిపిస్తోంది. ఇక మరో మూవీ మదరాసి.. తమిళ్ హీరో శివ కార్తికేయన్.. అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చేసిన మూవీ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అలాగే ఈ మూవీని మురుగదాస్ డైరెక్షన్ చేయడంతో ఆడియన్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేక పోయింది. మూవీకి నెగటివ్ టాక్ బలంగా వినిపిస్తోంది.

ఈ రెండు పెద్ద సినిమాల్లో ఓ చిన్న సినిమా కూడా విడుదలైంది. అదే లిటిల్ హార్ట్స్. ఓటీటీ మూవీగా ఈటీవీ విన్‌ ఈ మూవీని నిర్మించింది. అయితే 'లిటిల్‌ హార్ట్స్‌' సినిమాని చూసి నచ్చిన నిర్మాతలు బన్నీవాస్‌, వంశీ నందిపాటి ఈ సినిమా థియేటర్ కంటెంట్‌ అని భావించారు. అలా ముందుగా థియేటర్‌లోనే రిలీజ్‌ చేశారు. ఈ మూవీ నాన్ స్టాప్ ఎంటర్ టైనర్ గా దూసుకెళ్తోంది. జాతి రత్నాలు సినిమాను గుర్తు చేస్తోందంటూ నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Little Hearts Breaks Records Laughter-Filled Telugu Rom-Com Dominates Box Office

'90స్‌ మిడిల్‌ క్లాస్‌' సినిమాతో అందరికి సుపరిచితుడైన మౌళి తనూజ్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి '90స్‌'దర్శకుడు ఆదిత్యహాసన్‌ నిర్మాతగా ఉన్నారు. ఈ మూవీలోని సింపుల్‌ కామెడీని, వన్‌ లైనర్స్‌ సంభాషణలను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూవీకి కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. విడుదలైన రెండు రోజులకే వరల్డ్ వైడ్ గా సినిమా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+