అదృష్టం అంటే ఈ హీరోదే.. ఒక్క సినిమాతో 20 రెట్లు పెరిగిన రెమ్యూనరేషన్
సినిమాల్లో గుర్తింపు రావాలంటే సంవత్సరాలు పడుతుంది. పదుల సంఖ్యలో సినిమాలు చేస్తే తప్ప ఆడియన్స్ గుర్తించరు. అలాగే రెమ్యూనరేషన్ పెరగాలన్నా హీరోగా విజయం సాధించి తీరాల్సిందే. కానీ ఇవన్నీ ఓ యువ హీరో ఒక్క సినిమాతోనే తేల్చేశాడు. అప్పటి వరకు యూట్యూబ్, ఇన్ స్టాలో రీల్స్ తో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ కుర్ర హీరో ఒకే ఒక్క సినిమాతో హీరోగా సక్సెస్ సాధించాడు. అంతేకాక ఇప్పుడు తన రెమ్యూనరేషన్ కు ఏకంగా 20 రెట్లు పెంచుకున్నాడు. ఇంతకీ ఎవరా హీరో అని అనుకుంటున్నారా..
లిటిల్ హార్ట్స్ మూవీతో అందరినీ నవ్వించిన యువ సంచలనం మౌళి. ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. కేవలం ఒకే ఒక్క సినిమాతో తన సత్తా నిరూపించాడు. ఇప్పుడు అతని రెమ్యూనరేషన్ చూస్తే కళ్లు జిగేల్ అనాల్సిందే. అప్పటివరకూ యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ ఉన్న మౌళి.. '#90s మిడిల్ క్లాస్ బయోపిక్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత లిటిల్ హార్ట్స్ మూవీతో తొలి మూవీతోనే తిరుగులేని విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. రూ. 3 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ తోనే తీసిన ఈ మూవీకి దాదాపు రూ. 40 కోట్లు కలెక్షన్స్ రావడం విశేషం.

ఈ మూవీ తర్వాత మౌళి క్రేజ్ భారీగా పెరిగింది. లిటిల్ హార్ట్స్ మూవీకి కేవలం రూ. 5 లక్షలు మాత్రమే తీసుకున్న ఈ యువ హీరోకు ఇప్పుడు రూ. కోటి సైతం ఇచ్చేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారట. అంటే తొలి సినిమాతో పోల్చితే అతడి రెమ్యూనరేషన్ ఏకంగా 20 రెట్లు పెరిగినట్లు సమాచారం. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ రూ. కోటి రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపారు. అంతేకాక కొంత మొత్తంలో అడ్వాన్స్ కూడా ఇచ్చాయట.ఇక ప్రతిభ, పట్టుదల ఉంటే సినీ రంగంలో ఎవరైనా తమ సొంత సక్సెస్ స్టోరీని రాయగలరని ఈ యువ హీరో చూపించాడు. ఇక ప్రస్తుతం లిటిల్ హార్ట్స్ మూవీ ఓటీటీలో అలరిస్తోంది.












Click it and Unblock the Notifications