2 కోట్లు పెట్టి తీస్తే..40 కోట్లు వసూలు.. బాక్సాఫీస్‌ను ఫుట్‌బాల్ ఆడిన సినిమా

గతంలో మలయాళ, కోలీవుడ్‌లలో కనిపించిన ట్రెండ్‌ ఇప్పుడు తెలుగులోనూ కనిపిస్తోంది. అదే... తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన సినిమాలు, కేవలం కంటెంట్‌ బలంపైనే ఆధారపడి భారీ విజయాలను నమోదు చేయడం! అలాంటి సినిమాల జాబితాలో చేరిపోయి, బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమానే 'లిటిల్ హార్ట్స్'. ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ చిత్రానికి సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. మౌళి తనూజ్, శివాని నగరం, జై కృష్ణ, నిఖిల్ అబ్బూరి ప్రధాన పాత్రలు పోషించారు.

'లిటిల్ హార్ట్స్' సినిమా బడ్జెట్ కేవలం రెండున్నర కోట్ల రూపాయలు. కానీ, ఈ సినిమా థియేటర్ల నుంచి ఏకంగా రూ. 38 కోట్ల వసూళ్లను కొల్లగొట్టి, ట్రేడ్‌ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇది, కంటెంట్ బలంగా ఉంటే చిన్న సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది.

Little Hearts OTT Release The 2 5 Crore Telugu Film That Shocked Box Office with 38 Crores

ఈ సినిమా కథాంశం ఒక స్వచ్ఛమైన టీనేజ్ లవ్ స్టోరీ. అఖిల్-కాత్యాయని అనే ఇద్దరు స్టూడెంట్స్ మధ్య నడిచే ఈ ప్రేమకథ, పేరెంట్స్, టీనేజ్ పిల్లలు, చదువులు, ప్రేమలు అనే అంశాల చుట్టూ తిరుగుతుంది.

నిత్యం మనం చూసే విషయాలనే తీసుకుని, వాటిని సరదాగా, భావోద్వేగంగా ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో దర్శకుడు సాయి మార్తాండ్ విజయం సాధించాడు. ఈ తాజాదనం, ప్రేక్షకులకు కథ సులభంగా చేరువకావడమే ఈ సినిమాకు ఇంతటి భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది.

ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధం
థియేటర్లలో సంచలనం సృష్టించిన 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులు ఈటీవీ విన్‌కు దక్కగా, అక్టోబర్ 1 నుంచి ఇది స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో చూడలేని వారు, ఈ టీనేజ్ లవ్ స్టోరీని ఓటీటీలో వీక్షించి ఆస్వాదించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+