' వేశ్య చేతిలో కండోమ్.. రక్తపు కత్తితో హీరో '.. ఇదేం టీజర్ రా సామి..
చాలామంది డైరెక్టర్స్ కు యాక్టర్ అవ్వాలని ఓ కల ఉంటుంది. అలాగే యాక్టర్ అవుదామని వచ్చి డైరెక్టర్లు అయిన వాళ్లూ ఉన్నారు. మరికొందరు దర్శకులు తమ సినిమాల్లో చిన్న పాత్రల్లో మెరుస్తుంటారు. ఇక తమిళంలో టాప్ డైరెక్టర్ గా ఉన్న లోకేశ్ కనకరాజ్.. తాజాగా హీరో అవతారం ఎత్తాడు. హీరోగా నటించాలని ఆయనకు ఎప్పటినుంచో కోరిక అట. తాజాగా డీసీ అనే చిత్రంతో ఆయన హీరోగా పరిచయం కానున్నాడు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ తాజాగా రిలీజైంది. ఈ టీజర్ లో లోకేశ్ కనకరాజ్ మునుపెన్నడూ చూడని రగ్గెడ్ పాత్రలో కనిపిస్తున్నాడు.
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్. ఆయన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం విశేషం. అయితే తాజాగా ఆయన హీరో అవతారం ఎత్తాడు. డీసీ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ మూవీకి అరుణ్ మథేష్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తోంది.

డీసీ మూవీలో లోకేశ్ సరసన హీరోయిన్ గా వామికా గబ్బీ నటిస్తోంది. వామికాకు తమిళ్ లో ఇదే తొలి సినిమా కావడం విశేషం. తాజాగా రిలీజైన టీజర్ లోనూ వీరిమధ్య సన్నివేశాలు మరింత ఎట్రాక్షన్ గా నిలిచాయి. టీజర్ లో D అంటే దేవదాస్.. C అంటే చంద్ర అని టైటిల్ కి క్లారిటీ ఇచ్చేశారు.












Click it and Unblock the Notifications