మొత్తానికి తప్పు ఒప్పుకున్న సమంత
హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'ఏమాయ చేశావే'' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా సమంత పరిచియం అయింది. మహేష్ బాబుతో నటించిన ''దూకుడు'' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అక్కడ కూడా తాను ఏంటో నిరూపించుకుంది. విజయ్ , సూర్య, విక్రమ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకులు తర్వాత సమంతను ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. దీంతో కొంతకాలం సినిమాలకు దూరం ఉన్నారు. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమా తర్వాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు.

అయితే ఆరోగ్యం నుంచి కోలుకున్న సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ''హనీ, బన్నీ'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. డిసెంబర్‌లో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె గతంలో తాను నటించిన సినిమాల విషయంలో షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను ఎప్పుడు మంచి పాత్రలే ఎంచుకోవడానికి ట్రై చేస్తా.. గతంలో నా రోల్స్ విషయంలో కొన్ని తప్పులు చేశాను. వాటిని ఒప్పుకుంటున్నా.. ఇప్పుడు జాగ్రత్తపడుతున్నా అని సమంత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications