Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆస్కార్ బరిలో "మహావతార్ నరసింహా".. ఇట్స్ అఫిషియల్ !

'మహావతార్ నరసింహ'.. సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది ఈ చిత్రం. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాను దర్శకుడు అశ్విన్ కుమార్ సుమారు రూ.30 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. మహావిష్ణువు అవతారమైన నరసింహుని కథాంశంలో వచ్చిన ఈ యానిమేటెడ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నిజంగా నరసింహ స్వామి వచ్చి కనిపించాడా అన్న స్థాయిలో విజువల్స్ అదిరిపోయాయి. ఆ ఎలివేషన్ సీన్స్.. అందుకు తగ్గట్టుగా వచ్చే మ్యూజిక్ రోమాలునిక్కబొడుచుకునేలా చేశాయి.

ఈ సినిమా ఎలాంటి భారీ ప్రమోషన్స్ లేకుండానే విడుదలైంది. కేవలం మౌత్ టాక్ ద్వారానే దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. కథ, కథనం, అద్భుతమైన గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా, నరసింహ స్వామి కథను ఎంతో శక్తివంతంగా, భావోద్వేగంగా చూపించడం ప్రేక్షకులకు బాగా నచ్చింది. మరీ ముఖ్యంగా ఈ యానిమేషన్ చిత్రం కేవలం చిన్నపిల్లల కోసమే కాదు, పెద్దలు కూడా చూడవచ్చని నిరూపించింది. ఇప్పుడు లేటెస్ట్ గా మారు అరుదైన రికార్డు సాధించింది.

mahavathar-narasimha-movie-nominated-for-98th-oscar-awards

ఆస్కార్ బరిలో..

కాగా లేటెస్ట్ గా ఈ మూవీ మరో ఘనత సాధించింది. 98వ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించింది. యానిమేషన్ కేటగిరీలో ఈ సినిమా ఆస్కార్ లో ఎంట్రీ సాధించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అకాడమీ అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించింది.

ఇంకా ఏ చిత్రాలు ఉన్నాయంటే..?

యానిమేషన్ కేటగిరీలో అర్హత సాధించిన చిత్రాలు..

All Operators Are Currently Unavailable - ఆల్ ఆపరేటర్స్ ఆర్ కరెంట్‌లీ అనవైలబుల్
Arco - ఆర్కో
The Bad Guys 2 - ద బ్యాడ్ గైస్ 2
Black Butterflies - బ్లాక్ బటర్‌ఫ్లైస్
Boys Go to Jupiter - బాయ్స్ గో టు జూపిటర్
Chainsaw Man The Movie: Reze Arc - చెయిన్ సా మాన్ ది మూవీలో: రిజే ఆర్క్
Chao - చావో
Colorful Stage! The Movie: A Miku Who Can't Sing - కలర్‌ఫుల్ స్టేజ్! ది మూవీ: ఎ మికు హూ కాన్ట్ సింగ్
David - డేవిడ్
Demon Slayer: Kimetsu no Yaiba Infinity Castle - డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్‌ఫినిటీ క్యాసిల్
Dog Man - డాగ్ మాన్
Dog of God - డాగ్ ఆఫ్ గాడ్
Dragon Heart - Adventures Beyond This World - డ్రాగన్ హార్ట్ - అడ్వెంచర్స్ బియాండ్ దిస్ వరల్డ్
Elio - ఎలియో
Endless Cookie - ఎండ్‌లెస్ కుకీ
Fixed - ఫిక్స్‌డ్
Gabby's Dollhouse: The Movie - గ్యాబీస్ డాల్‌హౌస్: ది మూవీ
In Your Dreams - ఇన్ యువర్ డ్రీమ్స్
KPop Demon Hunters - కే పాప్ డీమన్ హంటర్స్
The Legend of Hei 2 - ది లెజెండ్ ఆఫ్ హేయి 2
Light of the World - లైట్ ఆఫ్ ది వరల్డ్
Little Amélie or the Character of Rain - లిటిల్ అమెలీ ఆర్ ది క్యారెక్టర్ ఆఫ్ రేన్
Lost in Starlight - లాస్ట్ ఇన్ స్టార్‌లైట్
A Magnificent Life - ఎ మాగ్నిఫిసెంట్ లైఫ్
Mahavatar Narsimha - మహావతార్ నర్సింహా
Night of the Zoopocalypse - నైట్ ఆఫ్ ది జూపోకాలిప్స్
Olivia & las Nubes - ఒలీవియా అండ్ లాస్ న్యూబెస్
100 Meters - 100 మీటర్స్
Out of the Nest - ఔట్ ఆఫ్ ది నెస్ట్
Scarlet - స్కార్లెట్

mahavathar-narasimha-movie-nominated-for-98th-oscar-awards

మొత్తానికి ఏ సినిమాకు ఆస్కార్ వరిస్తుందో చూడాలి. అవార్డు విషయాన్ని పక్కన పెడితే.. మహావతార్ నరసింహా సినిమా ఆస్కార్ కు ఎంపికవడం అనేది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రోత్సాహంతో భవిష్యత్తులో కూడా యానిమేటెడ్ సినిమాలు మరిన్ని నిర్మించే ఛాన్స్ ఉందంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+