భార్యపై చేయి చేసుకున్న మహేష్ బాబు
తెలుగు ఇండస్ట్రీలో ది బెస్ట్ జోడీ ఎవరంటే అందరు ఠక్కున చెప్పేది ..సూపర్ స్టార్ మహేష్ బాబు - నమ్రత శిరోద్కర్‌ల పేర్లే. పెద్దలను ఎదురించి మరి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. భార్య నమ్రత లేకుండా మహేష్ పెద్దగా బయటకు కూడా రారు. మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ మిస్ ఇండియా అనే సంగతి అందరికి తెలిసిందే. తరువాత పలు చిత్రాల్లో నమ్రత హీరోయిన్‌గా నటించి మెప్పించింది. మహేష్ బాబుతో వంశీ సినిమాలో హీరోయిన్‌గా చేసింది.

ఈ సినిమా షూటింగ్ సమమయంలోనే మహేష్ బాబు నమ్రతతో ప్రేమలో పడటం జరిగింది. పెద్దలను ఒప్పించి మరి ఇరువురు 2005లో పెళ్లి చేసుకున్నారు. వీరికి గౌతమ్, సితార ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ .. ఫ్యామిలీకి మహేష్ ఇచ్చే విలువ మరే హీరో కూడా ఇవ్వరనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. షూటింగ్య మధ్యలో గ్యాప్ దొరికితే చాలు..మహేష్ భార్య , పిల్లలతో ఫారెన్ వెళ్తుంటారు.మహేష్‌ను వివాహం చేసుకున్న తరువాత సినిమాలకు దూరం అయింది నమ్రత.

అలాంటి మహేష్ బాబు గురించి షాకింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. మహేష్ ఓ సందర్భంలో తన భార్యపై చేయి చేసుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా నమ్రతనే చెప్పడం సంచలనంగా మారింది. గౌతమ్ కడుపులో ఉన్నప్పుడు నమ్రత చాలా ఆరోగ్యపరమైన సమస్యలను ఫేస్ చేశారట. గౌతమ్ కడుపులో ఎదుగుదల చాలా స్లోగా జరిగిందట. ఏడో నెలలో ఉన్నప్పుడు గౌతమ్ కదలికలు చాలా తగ్గిపోయాయని ఆమె తెలిపింది.

బరువు కూడా ఎక్కువగా లేకపోవడంతో డాక్టర్స్ చాలా టెన్షన్ పడ్డారట. ఆ సమయంలో నమ్రత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడటం స్టార్ట్ చేశారట. మైండ్ కంట్రోల్లోకి రావడానికి డాక్టర్ సలహా మేరకు మహేష్ నమ్రతని లాగిపెట్టి కొట్టారట. మహేష్ అలా చేయడంతో నమ్రత మైండ్ స్టేబుల్‌గా వచ్చిందట. ఈ విషయాన్ని నమ్రతనే ఇటీవల ఓ ఇంటర్య్వూలో బయటపెట్టడం జరిగింది.
-
ఎన్టీఆర్ డైరెక్షన్లో చిరంజీవి నటించిన ఏకైక సినిమా -
ధురంధర్ 2 ట్విట్టర్ రివ్యూ: మాస్టర్ పీస్.. ఎపిక్ బ్లాక్ బస్టర్ -
రెండు ఎలక్ట్రిక్ స్టవ్ లు కొన్నా.. గ్యాస్ కొరత వేళ సూపర్ స్టార్ సంచలనం -
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు












Click it and Unblock the Notifications