3772 మందిని కాపాడిన మహేష్ బాబు..నువ్వు దేవుడివి సామి
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు , భరత్ అనే నేను, మహర్షి వంటి సూపర్ హిట్లతో ఆగ్ర స్థానానికి చేరువయ్యారాయన. సంక్రాంతికి మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారు.
నువ్వు కాపాడిన 3772 వ ప్రాణం స్వామి
— RISHI (@ursrishi7) October 9, 2024
🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡
దైవం మానుష రూపేణ @urstrulyMahesh ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ pic.twitter.com/Xp6Go329rN
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు తన లుక్‌ను మొత్తం మార్చేశారు. గెడ్డం, జుట్టు ఫుల్‌గా పెంచేసి కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మహేష్ బాబు చేసే సామాజిక సేవలు గురించి ఎంత చెప్పుకున్న తక్కవే. మరే ఇతర హీరోకు సాధ్యం కాని విధంగా మహేష్ బాబు సేవలందిస్తున్నారు. తెలంగాణలో ఓ గ్రామాన్ని, ఆంధ్రలో మరో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ది చేస్తున్నారు మహేష్ బాబు. ముఖ్యంగా చిన్న పిల్లల్ని కాపాడే విషయంలో మహేష్ బాబు ముందుంటారు. అందులో మెయిన్‌గా చెప్పుకోవాల్సింది చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల గురించే. ఇప్పటి వరకు వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయించారు మహేష్ బాబు.

చిన్న పిల్లల గుండె ఆపరేషన్లకు సంబంధించి మహేష్ బాబు బాలకృష్ణ షోకు వచ్చిన సందర్భంలో వివరించారు. మహేష్ బాబు తనయుడు గౌతమ్‌కు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, అప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది.. లేని వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించకున్నానని, అప్పటి నుంచి చిన్న పిల్లల గుండె ఆపరేషన్లకు సాయం చేస్తున్నామని మహేష్ బాబు తెలిపారు. తాజాగా మహేష్ బాబు మరో ప్రాణాన్ని కాపాడారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కత్తుల వారి పేటకు చెందిన రెండేళ్ల రిత్వికకు ఉచితంగా గుండె సర్జరీ చేయించారు. ఈ నేపథ్యంలో కత్తుల వారి పేటలో మహేష్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందర్ని ఆకట్టుకుంది. 'నువ్వు కాపాడిన 3772 వ ప్రాణం సామీ.. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు. మాకు నమ్మించే అక్కర లేదు. ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం' అంటూ ఖలేజా మూవీలోని డైలాగ్‌తో వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.












Click it and Unblock the Notifications