మహేష్ బాబుకు ఆ రాజకీయ పార్టీ అంటే అంత పిచ్చా...?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా రిజర్డ్వ్‌గా ఉంటారనే విషయం అందరికి తెలిసిందే. సినిమాలు, ఫ్యామిలీ తప్పిస్తే.. ఆయనకు మరో లోకం తెలియదు. షూటింగ్ సమయంలో గ్యాప్ దొరికితే చాలు.. భార్య, పిల్లలతో కలిసి ఫారిన్ టూర్ చెక్కేస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే మహేష్‌లో కొంత మార్పు కనిపిస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో కాస్తా యాక్టివ్‌గానే కనిపిస్తున్నారు. తన సినిమా విశేషాలతో పాటు, జిమ్‌లో వర్క్ అవుట్ చేస్తున్న ఫొటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. మహేష్ బాబు రాజకీయాలకు దూరంగా ఉంటారనే విషయం తెలిసిందే. పలుమార్లు ఆయన్ను రాజకీయాలకు సంబంధించి ప్రశ్నించినప్పటికి ఆయన దీనిపై పెద్దగా స్పందించలేదు. తనకు రాజకీయాలపై అవగాహన లేదని, వాటి గురించి తనకు పెద్దగా తెలియదని మహేష్ బాబు చెప్పడం జరిగింది.

అయితే మహేష్ బాబు ఓ రాజకీయ పార్టీని అమితంగా అభిమానిస్తారని తెలుస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. దీని కారణంగానే మహేష్ బాబు కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీలో కృష్ణ కీలక పాత్ర పోషించారు. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత కూడా కృష్ణకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో మంచి సంబంధాలు ఉండేవి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్ల కృష్ణ ప్రత్యేక అభిమానం కనబరిచేవారు. వైఎస్ఆర్ సైతం కృష్ణ అంటే గౌరవం చూపించేవారు.
మహేష్ బాబు బాబాయ్ ఆదిశేషగిరిరావు ఓ సందర్భంలో ఈ విషయంపై స్పందించారు. ఆయన మాటలను బట్టి చూస్తే మహేష్ బాబుకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానమని తెలిసింది. తండ్రి కృష్ణ పని చేసిన పార్టీ కావడంతో పాటు మహేష్ కాంగ్రెస్ పట్ల అభిమానం చూపించేవారట. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మహేష్ బాబు ముందే ఊహించారని ఆదిశేషగిరిరావు తెలిపారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డే సీఎం అని కూడా మహేష్ బాబు తెలిపినట్టు ఆదిశేషగిరిరావు పేర్కొన్నారు. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ..ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications