రాముడి పాత్రలో ట్విస్ట్ రివీల్.. ‘వారణాసి’పై మహేష్ బిగ్ అప్డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా 'వారణాసి'. టైటిల్ అనౌన్స్ చేసిన రోజే ఈ ప్రాజెక్ట్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ వేడుకలోనే దర్శకధీరుడు రాజమౌళి మహేష్ పాత్రను రీవిల్ చేయడంతో... అప్పటి నుంచి హైప్ గ్రాఫ్ ఆకాశాన్ని తాకుతోంది. మధ్యలో వచ్చిన కొన్ని లీక్స్, మహేష్ లుక్స్ గురించి వైరల్ అయిన టాక్స్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. తాజాగా అయితే, ఈ సినిమా గురించి ఇప్పటివరకు బయటకు రాని కీలక విషయాలనే మహేష్ బాబు స్వయంగా బయటపెట్టడం ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపింది.
ఇటీవల 'వారణాసి' చిత్ర బృందం ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఓపెన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - రాజమౌళి దర్శకత్వంలో పని చేయాలనే కోరిక తనకు చాలా ఏళ్లుగా ఉందని తెలిపారు. దాదాపు పదిహేను సంవత్సరాల క్రితమే ఈ కల మొదలైందని, ఇప్పుడు అది కార్యరూపం దాల్చిందన్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్' పూర్తయ్యాక రాజమౌళి దాదాపు ఏడాది పాటు 'వారణాసి' కథపై పని చేశారని, స్క్రిప్ట్ వినిపించినప్పుడు తనకు ఆశ్చర్యం కలిగిందని చెప్పారు. ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలతో పోలిస్తే 'వారణాసి' పూర్తిగా భిన్నమైన దిశలో సాగుతుందని మహేష్ బాబు తెలిపారు. యాక్షన్, అడ్వెంచర్‌తో పాటు పురాణాలు, కాలయానం వంటి అంశాలు ఈ కథలో భాగమవుతాయని చెప్పారు. ఈ అన్ని అంశాలను ఒకే కథలో సహజంగా మేళవించిన విధానం తనను ఆకట్టుకుందని, అందుకే మొదట కొంత భయం వేసినా, కథను వివరించిన తీరు ఆ సందేహాలను తొలగించిందని పేర్కొన్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి పాత్రను పోషిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. రాముడి పాత్ర అంటే కేవలం శారీరక బలం కాదు, హుందాతనం, ఆచరణ, అంతర్గత స్థైర్యం ప్రధానమని తెలిపారు. ఆ లక్షణాలు తెరపై ప్రతిబింబించాలనే ఉద్దేశంతో నిలబడే విధానం నుంచి నడక, శరీర భంగిమల వరకు విస్తృతంగా రిహార్సల్స్ చేసినట్టు చెప్పారు. ఈ పాత్ర కోసం 2024 నుంచే ప్రత్యేకంగా సిద్ధమయ్యామని వెల్లడించారు.
చిత్రానికి సంబంధించిన లుక్స్, బాడీ లాంగ్వేజ్ కోసం మహేష్ బాబు అనేక వర్క్‌షాప్‌లలో పాల్గొన్నారు. గత ఏడాది జర్మనీలో కూడా ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్టు తెలిపారు. రాజమౌళి ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తారని, అవసరమైతే ఎన్ని సార్లైనా రిహార్సల్స్ చేయిస్తారని చెప్పారు. యూరోపియన్ శిల్పాలు, పురాతన కళారూపాలను అధ్యయనం చేసి పాత్రకు అవసరమైన భంగిమలను రూపొందించినట్టు వెల్లడించారు.
ఇక్కడే అసలు రాజమౌళి మార్క్ కనిపిస్తుంది. మహేష్ పరిగెత్తే స్టైల్ కూడా మార్చారట! దానికి ప్రత్యేకంగా ఆరు నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నారు. అంతా ఎందుకో తెలుసా? సినిమాలో కేవలం రెండు షాట్ల కోసం. రాజమౌళికి సినిమా మీద ఉన్న పిచ్చి, పరిపూర్ణతపై ఆయన చూపించే శ్రద్ధకు ఇదే పెద్ద ఉదాహరణ. యూరోపియన్ శిల్పాలు అధ్యయనం చేయడం నుంచి ప్రతి చిన్న డీటెయిల్ వరకు ఆయన వదలలేదు.
రాజమౌళి రిప్లై... ఫ్యాన్స్‌కి షాక్!
స్క్రిప్ట్ విన్న తర్వాత మహేష్ బాబు రాజమౌళికి ఓ మెసేజ్ పంపారట - "మీ దర్శకత్వంలో నటించడం గర్వంగా ఉంది. మీరు కథ చెప్పిన తీరు అద్భుతం" అని. దానికి రాజమౌళి ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్ అవుతోంది. "నాకు నా సినిమాల్లో విలన్ పాత్రలు అంటే చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్లను నేను ప్రేమిస్తాను" అని పంపారట. దానికి మహేష్ కూడా సరదాగా "నాకూ ప్రతినాయక పాత్రలంటే ఇష్టమే" అని రిప్లై చేశారట. ఈ మాటలే సినిమాలో ఊహించని ట్విస్టులు ఉండబోతున్నాయనే సంకేతాలు ఇస్తున్నాయంటూ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. రాజమౌళి సెట్‌లో నటీనటులకు టెక్నికల్ విషయాలు చెప్పరట. ఆ భారం అంతా ఆయనే మోస్తారు. మానిటర్ చూసే అవకాశం కూడా ఇవ్వకుండా, షాట్ అయిపోయిన వెంటనే నెక్ట్స్ సీన్‌కి తీసుకెళ్తారట. ఇన్ని విశేషాలతో 'వారణాసి'పై అంచనాలు ఇక మామూలుగా ఉండవు. మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా... ఇండియన్ సినిమాకే కొత్త బెంచ్‌మార్క్ అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్‌లో రోజురోజుకీ పెరిగిపోతోంది
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications