మోస్ట్‌ పాపులర్‌ హీరోల జాబితాలో మహేష్‌బాబుకు దారుణమైన రేటింగ్

భారత సినీ చరిత్రలో మోస్ట్ పాపులర్ హీరోలు ఎవరు? హీరోయిన్లు ఎవరు? తదితర వివరాలతో ఐఎండీబీ ఎప్పుడూ జాబితాను విడుదల చేస్తుంటుంది. ఈ జాబితా విడుదల చేయడానికి ముందు సమయంలో ఏ హీరోల సినిమాలు ఎక్కువగా విడుదలయ్యాయో, ఎవరు ఎక్కువగా వివాదాల్లో ఉన్నారో, ప్రజల్లో ఎక్కువగా ఎవరి పేరు నానుతుందో, ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉంది, ప్రేక్షకులు ఎవరిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు లాంటి వివరాలన్నీ చూసుకొని ఈ జాబితాను విడుదల చేస్తారు. తాజాగా టాప్-25 పేరుతో ఐండీబీ జాబితాను ప్రకటించింది. ఇందులో పుష్ప2 సినిమాతో భారత సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన అల్లు అర్జున్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.

వివాదాలతో సహవాసం
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప2 సినిమా రూ.1850 కోట్లపైనే వసూళ్లు రాబట్టింది. దంగల్ రికార్డును బద్దలు కొట్టే పనిలో ఈ సినిమా ఉంది. సంధ్య థియేటర్ లో తొక్కిసలాట, అభిమాని మృతి, ఆమె కుమారుడు ఆసుపత్రిలో ఉండటం, అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం లాంటివన్నీ కూడా రేటింగ్ కు కలిసివచ్చాయి. వివాదాలతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. వాస్తవానికి ఎప్పుడూ నెంబర్ వన్ స్థానంలో ఉండే డార్లింగ్ ప్రభాస్ ఏడో స్థానానికి పడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు.. దేవర సినిమాతో ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా 23వ స్థానంలో నిలిచారు. ట్విటర్ లో ఎక్కువమంది మాట్లాడుకున్నవారి జాబితాలో టాప్10లో 10వ స్థానాన్ని తారక్ దక్కించుకున్నారు. అలాగే ప్రభాస్ ఎప్పుడూ ఆర్మాక్స్ జాబితాలో నెంబర్ వన్ గా నిలుస్తున్నారు.

Mahesh Babu ranks 25th in IMDB s Top 25 Pan-Indian Superstars list

అత్యంత ఆశ్చర్యం కలిగించింది
రాజమౌళి దర్శకత్వంలో రూ.1500 కోట్ల బడ్జెట్ తో భారీ పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్న మహేష్ బాబు ఈ జాబితాలో 25వ స్థానాన్ని దక్కించుకొని చివరి స్థానంలో నిలబడ్డారు. మహేష్ బాబు లాంటి స్టార్ ఈ స్థానంలో నిలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సంవత్సరం నుంచి ఎటువంటి సినిమా చేయకపోవడం, ప్రేక్షకులకు దూరంగా ఉండటమే అందుకు కారణమని తెలుస్తోంది. మొత్తం ఈ జాబితాలో ఎవరెవరు, ఏయే స్థానాల్లో నిలబడ్డారో చూద్దాం.

1- అల్లు అర్జున్,
2- షారూఖ్‌ ఖాన్‌,
3- యష్‌,
4- రణ్‌ బీర్‌ కపూర్‌,
5- దేవ్‌,
6- జీత్‌,
7-ప్రభాస్‌,
8-రామ్‌ చరణ్‌,
9-కార్తిక్‌ ఆర్యన్‌,
10-విజయ్‌,
11-హృతిక్‌ రోషన్‌,
12-రజనీకాంత్‌,
13-మిథున్‌ చక్రవర్తి,
14-సల్మాన్‌ ఖాన్‌,
15-ఆమీర్‌ ఖాన్‌,
16-ధనుష్‌,
17-విజయ్‌ సేతుపతి,
18-అజయ్‌ దేవగన్‌,
19-ఫాహద్‌ ఫాజిల్‌,
20-దుల్కర్‌ సల్మాన్‌,
21-యష్‌ దాస్‌ గుప్తే,
22-జిష్సు సేన్‌ గుప్తా,
23-ఎన్టీఆర్‌,
24-కమల్‌ హాసన్‌,
25-మహేష్‌ బాబు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+