జక్కన్న మామూలోడు కాదయ్యో:: రూ. 2,500 కోట్ల కలెక్షన్లకు పక్కా ప్లాన్- బ్యాక్ అండ్ బ్యాక్
సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం వారణాసి. పాన్ వరల్డ్ లెవెల్ లో చిత్రీకరణ జరుపుకొంటోందీ మూవీ. గత ఏడాది నవంబర్ లో రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్లెస్ ఈ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఇచ్చాయి. సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. రుద్రగా గతంలో ఎప్పుడో చేయని రోల్ లో మెరుపులు మెరిపించబోతోన్నాడు మహేష్ బాబు. ప్రియాంక చోప్రా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ది ఇందులో కీ రోల్.
ఈ సినిమాపై తాజా సమాచారం వెలువడింది. 2027, ఏప్రిల్ 7వ తేదీన విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని వారణాసి యూనిట్ అధికారికంగా వెల్లడించింది. Let it bang..VARANASI ON APRIL 7th, 2027 అని అధికారికంగా ప్రకటించింది. ఎక్స్ అకౌంట్ లో దీన్ని షేర్ చేసింది. విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ ఓ న్యూ పోస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. అంతరిక్షం నుంచి దూసుకొచ్చిను ఓ భారీ ఉల్క.. భూమిని బద్దలు కొట్టేలా ఢీ కొట్టేలా డిజైన్ చేసిన పోస్టర్ అది. ఇది 7 ఆకారంలో కనిపించింది.

మహేష్ బాబు రేంజ్ కు తగ్గట్టుగా పోస్టర్ డిజైన్ చేశారు. బాక్సాఫీస్ కలెక్షన్లన్నీ కూడా బద్దలు కావడం ఖాయమని చెప్పకనే చెప్పిందిది. 2027లో ప్రేక్షకుల ముందుకు వస్తోన్నామంటూ హింట్ ఇచ్చింది వారణాసి యూనిట్. అప్పట్లో విడుదల తేదీని కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడీ కొరత తీరింది. 2027 ఏప్రిల్ 7వ తేదీన ఉగాది నాడు పాన్ వరల్డ్ లెవెల్ లో విడుదల కాబోతోంది.
Let it bang……#VARANASI ON APRIL 7th, 2027. pic.twitter.com/nRYtTdA8bd
— Varanasi (@VaranasiMovie) January 30, 2026
వారణాసిలో ముఖ్యమైన రామాయణ ఎపిసోడ్‌ను చిత్రీకరించినట్లు సినిమా టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ సందర్భంగా ఎస్ ఎస్ రాజమౌళి వెల్లడించిన విషయం తెలిసిందే. సంజీవినీ పర్వతాన్ని తీసుకొచ్చిన హనుమంతుడి ఉదంతం ఈ సినిమా ప్రధాన కథాంశంగా అప్పట్లో చెప్పారాయన. ఎటు తిరిగి రామాయణం బ్యాక్ గ్రౌండ్ కావడం వల్ల 2027 ఏప్రిల్ 9వ తేదీన శ్రీరామనవమి నాడు సినిమా విడుదల అయ్యే అవకాశాలు లేకపోలేదనే అంచనాలు వ్యక్తం అయ్యాయి.
దీనికి తగ్గట్టుగానే శ్రీరామనవమికి వారం రోజుల ముందు విడుల కానుంది. ఉగాది సెలవు, బ్యాక్ అండ్ బ్యాక్ వీకెండ్ హాలిడేస్ కలిసి రానున్నాయి. దీంతో తొలి వారం రోజుల్లోనే 1,200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసేలా రాజమౌలి ప్లాన్ చేశాడని చెబుతున్నారు. హాలీవుడ్ రేంజ్ లో కరెక్ట్ గా మార్కెటింగ్ ప్లాన్ చేస్తే వారణాసి మూవీ.. రూ.2,500 కోట్ల కలెక్షన్లను అలవోకగా రాబట్టుకుంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
-
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్‌లో ఆనంద క్షణాలు -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..!












Click it and Unblock the Notifications