ఆ 3 సినిమాలు వద్దని ఆ హీరోను స్టార్ హీరోగా మార్చిన మహేష్‌బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేయాల్సిన సినిమాకు సిద్ధమవుతున్నాడు. దీనికోసం ఆయన మేకోవర్ అవుతున్నారు. ఇటీవలే జర్మనీ వెళ్లి శిక్షణ తీసుకున్నారు. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తన నుంచి ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమా వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టింది. అందుకు కారణం మహేష్ బాబుకు ఉన్న అభిమానుల బలం. మహేష్ బాబు ఎప్పుడు ఏ సినిమాను ఎంచుకుంటాడో? ఎందుకు ఏ సినిమాను వద్దంటాడో? ఆయన సన్నిహితులకు కూడా అర్థం కాదు.

పాన్ ఇండియా హీరోగా మారిపోయారు
ప్రేక్షకులు ఎప్పుడూ ఒకే తరహాలో హీరోను చూడాలనుకోరు. రకరకాల పాత్రల్లో, రకరకాల వేషధారణల్లో, రకరకాల హావభావాలతో చూడాలనుకుంటున్నారు. అలా చేశారు కాబట్టే దివంగతులైన మహానటులు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్లుగా నిలిచిపోయారు. అలా కాకుండా మహేష్ బాబులా నేను మారను.. నా మేకప్ స్టైల్ మార్చుకోను.. ఏ సినిమాలో చూసినా నేను ఒకేలా కనపడతాను అంటే ప్రేక్షకులు కొన్నాళ్లు మాత్రమే చూస్తారు. అలా పాత్రల్లో మేకవర్ అవ్వాల్సి వస్తుందనే కారణంతో మూడు సినిమాలు వదులుకోగా వాటిని చేసిన హీరో బ్లాక్ బస్టర్లు సాధించి పాన్ ఇండియా హీరోగా మారిపోయారు.

Mahesh Babu who turned allu arjun into a star hero in those 3 movies

సుకుమార్ ఎంత చెప్పినా వినలేదు
పుష్ప సినిమా ముందుగా మహేష్ బాబుతో చేయాలని సుకుమార్ భావించారు. ఎంత చెప్పినా ప్రిన్స్ మాత్రం ఒప్పుకోలేదు. పైగా అది నాకన్నా అల్లు అర్జున్ కు బాగా సెట్ అవుతుందని చెప్పి మరీ పంపించారు. ఆ సినిమా తెలుగులోకన్నా హిందీలో భారీ హిట్ సాధించింది. పుష్ప2 హిట్ అయితే బన్నీ పాన్ ఇండియా హీరోగా స్థిరపడినట్లే. అలాగే అల వైకుంఠపురం కూడా మహేష్ బాబు చేయాలి. కానీ వేరే సినిమాలు చేస్తుండటంతో ఖాళీ లేదని చెప్పడంతో త్రివిక్రమ్ బన్నీతో చేశాడు. మహేష్ బాబుతో ఈ సినిమా చేయాలని త్రివిక్రమ్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి అల్లు అర్జున్ రేంజ్ ను పెంచేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి అనే శక్తివంతమైన పాత్రను చేయాలని అడిగినా మహేష్ బాబు ఒప్పుకోలేదు. దీంతో అల్లు అర్జున్ చేత దర్శకుడు ఆ పాత్ర చేయించగా మంచిపేరు రావడంతోపాటు రేంజ్ కూడా పెరిగింది.

నేను మారను.. ఇలానే ఉంటాను అంటే రాజమౌళి బెత్తం పట్టుకుంటాడు. అందుకే ఆయన కోరినట్లుగా ఇప్పుడు ఆ పాత్రకోసం జుట్టు, గెడ్డం మహేష్ బాబు పెంచుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+