ఒకప్పుడు మహేష్ బాబు సినిమాలో హీరోయిన్..ఇప్పుడు డబ్బులు కోసం ఆ పని

బండ్లు ఓడ‌లు, ఓడ‌లు బండ్లు అవుతాయ‌నే సామెత మ‌నం త‌ర‌చూ వింటాం. ఈ సామెత‌ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారికి సరిగ్గా సరిపోతుంది. సినిమా వాళ్ల జీవితాలు పైకి అద్దాల మేడల్లాగా బాగా కనిపిస్తాయి. కానీ వారి జీవితాల్లోకి తొంగి చూస్తే అనేక బాధలు దర్శనం ఇస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఓ వెలుగు వెలిగిన నటి, ఇప్పుడు ఏమాత్రం సంబంధం లేని ఉద్యోగం చేసుకుంటుంది. ఒకప్పుడు వెండితెరను ఏలిన హీరోయిన్, ప్రస్తుతం గూగుల్ ఇండియాలో ఉన్నత ఉద్యోగంలో ఉన్నారు. ఇలా ఉద్యోగం చేసుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదు..మయూరి కాంగో. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియక పోవచ్చు. కానీ ఆమె తెలుగులో కూడా నటించారు.

Mahesh Babu s heroine Mayuri Kango is now working at Google
1990ల్లో బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా గడిపిన మయూరి కాంగో, మహేష్ బాబు హీరోగా, బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన 2000వ సంవత్సరపు తెలుగు చిత్రం 'వంశీ'లో నమ్రత శిరోద్కర్‌తో పాటు ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు.

మహేష్ భట్ దర్శకత్వం వహించిన 'పాపా కహ్‌తే హై' (1996) సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రంలోని 'ఘర్ సే నికాల్‌తే హై..' పాటలో ఆమె అందం, అభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఒక్క పాటతోనే మయూరి అప్పట్లో ఎంతో పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో ఆమె జుగల్ హన్సరాజ్‌కి జోడీగా నటించారు.

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజినగర్‌లో 1982, ఆగస్టు 15న సుజాత కాంగో, బాలచంద్ర కాంగో దంపతులకు జన్మించిన మయూరి, ఔరంగాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. ముంబైకి వచ్చినప్పుడు అనుకోకుండా ఆమెకు సినిమా అవకాశం లభించింది. 1995లో విడుదలైన 'నసీమ్' సినిమాలో నెగిటివ్ రోల్‌లో మెప్పించి, మహేష్ భట్ దృష్టిని ఆకర్షించారు.

ఆ తర్వాత ఆమె 'బేతాబీ', 'హోగే ప్యార్ కీ జీత్', 'బాదల్' వంటి పలు సినిమాల్లో నటించారు. కొన్నాళ్ల పాటు సీరియల్స్‌లో కూడా నటించినప్పటికీ, ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయాయి. దక్షిణాదిలో కూడా ఆఫర్లు తగ్గడంతో, క్రమంగా సినిమాలకు దూరమయ్యారు.

సినీ కెరీర్ పెద్దగా రాణించకపోవడంతో, మయూరి కాంగో సినిమాలు, టీవీ పరిశ్రమకు పూర్తిగా గుడ్‌బై చెప్పి, కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 2019లో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఇండియాలో ఇండస్ట్రీ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుండి ఆమె అదే కంపెనీలో కీలక పదవిలో కొనసాగుతున్నారు.

వెండితెరపై వెలుగు చూసిన ఒక నటి, ఉన్నత విద్యాభ్యాసం, కృషి, పట్టుదలతో ప్రపంచ ప్రసిద్ధ టెక్ కంపెనీలో కీలక స్థానానికి ఎదగడం నిజంగా స్ఫూర్తిదాయకం. మయూరి కాంగో ప్రయాణం కేవలం గ్లామర్ ప్రపంచానికి మాత్రమే పరిమితం కాకుండా, తమ లక్ష్యాలను సాధించుకోవడానికి దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+