ఇది మహేష్ బాబు స్టామినా..బాక్సాఫీస్ దుమ్ము దులిపిన 'మురారి'

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి సూపర్ హిట్లతో ఆగ్ర స్థానానికి చేరువయ్యారాయన. అందరి హీరోలకు అభిమానులుంటారు. కానీ మహేష్ బాబును ఆయన అభిమానులు దేవుడుగా కొలుస్తారు.

దీనికి కారణం కూడా లేకపోలేదు. మహేష్ 1000 మందికి పైగా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి వారి కుటుంబాలకు అండగా నిలిచారు. ఈ కారణంగానే మహేష్ బాబును దేవుడుతో పోలుస్తుంటారు అభిమానులు. ఇదిలా ఉంటే మహేష్ బాబు అభిమానులు గత కొన్నేళ్లుగా మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈసారి ఆయన నటించిన సూపర్ హిట్ మురారి సినిమాను రీ రిలీజ్ చేశారు.

Mahesh Babu s Murari Movie Re-Release All Time Record

అడ్వాన్స్ బుకింగ్‌లో రికార్డు క్రియేట్ చేసిన ఈ మూవీ, కలెక్షన్లు విషయంలో కూడా సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన.. మురారి మూవీకి ఫ్యాన్స్ చేసిన సెలెబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోస్ ఏ కనిపిస్తున్నాయి. ఈ రేంజ్ లో రీరిలీజ్‌ను కూడా సెలెబ్రేట్ చేయడం కేవలం మహేష్ బాబు అభిమానులకు చెల్లింది. ఓ జంట అయితే ఏకంగా థియేటర్‌లో పెళ్లి చేసుకున్న వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

రీరిలీజ్‌ను ఇలా కూడా సెలెబ్రేట్ చేయవచ్చా అనే విధంగా మహేష్ బాబు అభిమానులు నిరూపించారు. ఇక కలెక్షన్ల విషయంలో కూడా మురారి సత్తా చాటింది. ఈ క్రమంలో అడ్వాన్స్ బుకింగ్స్ లో మురారి మూవీ..ఏపీ , నైజం లో కలిపి రూ. 2.26 కోట్లు రాబట్టింది. నైజంలో అల్‌టైం రికార్డు మహేష్ బాబు పేరునే ఉంది. పవన్ కల్యాణ్ నటించిన రీరిలీజ్‌ కలెక్షన్లను మురారి ఒక్కరోజులోనే క్రాస్ చేసి సంచలనం సృష్టించింది.

ఇప్పటివరకు మహేష్ రీరిలీజ్ సినిమాలలో బిజినెస్ మ్యాన్ తర్వాత.. మురారి హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక వీకెండ్ కావడంతో.. శనివారం కూడా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో.. రూ. 20 ల‌క్ష‌ల‌కు పైగా వచ్చినట్లు సమాచారం. మురారి మూవీ రీ రిలీజ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ ఐదున్న‌ర కోట్ల‌కుపైగానే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు తెలిసింది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో మురారి మూవీకి ఏపీ, నైజాంలో క‌లిసి 2.26 కోట్ల వ‌ర‌కు వ‌చ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+