ఆ సినిమా వదులుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్న మహేష్ బాబు
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. ఆయన దగ్గరకు ఎన్నో కథలు వస్తూ ఉంటాయి. కథ నచ్చక కొన్ని, మరికొన్ని ఇతర కారణాలతో వాటిని తిరస్కరిస్తుంటారు. పరిశ్రమలో ప్రతి హీరోకు ఇటువంటి సందర్భాలు చాలా ఎదురవుతుంటాయి. ఒక హీరోకు నచ్చక మరో హీరో చేయడం లాంటివి సర్వసాధారణం. ప్రిన్స్ అలా వద్దన్న సినిమాల్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలే ఎక్కువగా ఉంటాయి.
అయితే ఒక కథను మాత్రం ఒప్పుకోవాలా? వద్దా? అనే డైలమాలో పడిపోయారు. అదేదో కాదు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన అత్తారింటికి దారేది చిత్రం. ఈ కథను దర్శకుడు త్రివిక్రమ్ ముందుగా మహేష్ బాబుకే వినిపించారు. మీరు చేస్తే బాగుంటుందంటూ ఒప్పించడానికి గట్టిగా ప్రయత్నించారు. అయితే ఎందుకో ప్రిన్స్ కు కథ నచ్చలేదు. అయినా కొన్ని సన్నివేశాలను మారిస్తే నటిస్తానని మహేష్ బాబు అన్నారు. కానీ సన్నివేశాలు మార్చడానికి త్రివిక్రమ్ అంగీకరించలేదు. చివరకు కథ పవన్ కల్యాణ్ దగ్గరకు చేరింది.. సినిమా భారీ హిట్ గా నిలిచింది.

అప్పట్లో ఆ సినిమా వదులకున్నందుకు మహేష్ బాబు ఎంతో బాధపడేవారు. చాలా సినిమాలు వదులకున్నప్పటికీ ఒకటి, రెండు సినిమాలు మాత్రం చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. అటువంటివాటిల్లో అత్తారింటికి దారేది చిత్రం కూడా ఉంది. అంతకుముందు కూడా సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నాన్నకు ప్రేమతో చిత్రం కథ కూడా ముందుగా సూపర్ స్టార్ దగ్గరకే వచ్చింది. దాన్ని కూడా తిరస్కరించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత కూడా చేయలేకపోయానని మహేష్ బాబు బాధపడేవారు. ఎన్నో సినిమాలను వద్దనుకున్నప్పటికీ తనకు అత్తారింటికి దారేది సినిమా చేయలేకపోవడం మాత్రం ఎంతో వెలితిగా ఉండేదని తన సన్నిహితులతో మహేష్ బాబు అంటుండేవారు.












Click it and Unblock the Notifications