Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిరు కొత్త మూవీలో యంగ్ హీరోయిన్..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. సంక్రాంతి కానుకగానే ఆయన నటించిన "మన శంకర వరప్రసాద్ గారు" ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అపజయమే ఎరుగని అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ చిత్రంతో అటు మాస్, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ, కెరీర్‌లోనే తొలిసారి రూ.300 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించారు. ఈ విజయంతో చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా పెరిగాయి.

ఈ క్రమంలోనే తన 158వ సినిమాపై ఫోకస్ పెట్టారు మెగాస్టార్. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు బాబీతో మళ్లీ మూవీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్‌లో రక్తంతో తడిసిన గొడ్డలి, రక్తం చిందిన బ్యాక్‌డ్రాప్ తో చూపించారు. ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ఈ మూవీ వచ్చే నెలలో ప్రారంభమై, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని అంటున్నారు.

makers-clarity-about-krisht-shetty-acting-in-megastar-and-bobby-new-movie

ఈ సినిమాలో చిరంజీవిని కొత్త షేడ్‌లో చూపేందుకు బాబీ కొల్లి ఓ సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నట్లు టాక్. యాక్షన్, బలమైన ఎమోషన్, సెంటిమెంట్ కలబోసిన కథగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ఇందులో నటించనున్నారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. అలానే మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్ కూడా ముఖ్య పాత్రలో మెరవనున్నారని గుసగుసలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ చిత్రంలో చిరంజీవి తండ్రి పాత్రలో కనిపిస్తారనే టాక్ ఉంది. అయితే కథలో మార్పులు చేస్తూ సినిమాను కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారని సమాచారం. "కూతురు సెంటిమెంట్" ఈ కథలో కీలకం కానుందని, తండ్రి-కూతురు మధ్య భావోద్వేగ బంధం చిరంజీవి ఇమేజ్‌కు కొత్త డైమెన్షన్‌ను ఇస్తాయని ప్రచారం జోరుగా సాగుతోంది. అందులో భాగంగానే చిరు కుమార్తె పాత్ర కోసం 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టిని ఎంపిక చేశారన్న వార్తలు హల్‌చల్ చేశాయి.

makers-clarity-about-krisht-shetty-acting-in-megastar-and-bobby-new-movie

అయితే ఈ వ్యవహారంపై స్పందించిన చిత్ర యూనిట్ వాటిని ఖండించింది. అవన్నీ పూర్తిగా అవాస్తవాలని స్పష్టం చేసింది. అధికారిక సమాచారం ఇచ్చేంత వరకు ఇలాంటి ఊహాగానాలను నమ్మవద్దని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. దీంతో కృతి శెట్టి రూమర్లకు అడ్డుకట్ట పడినట్టయింది. మరోవైపు ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిశీలనలో ఉండటం అంచనాలను పెంచుతోంది. మరి ఈ మూవీతో బాబీ ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+