ప్రభాస్ హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్న మెగాస్టార్..!
తమిళ హీరోయిన్ "మాళవిక మోహనన్" గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందం, నటనతో ఈ బ్యూటీ సౌత్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొదట మలయాళ సినిమాల ద్వారా కెరీర్ ప్రారంభించిన మాళవిక.. ఆ తరువాత తమిళం, హిందీ, కన్నడ భాషల్లో నటిస్తూ సౌత్ సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకుంది.
మాస్టర్‌తో బిగ్ బ్రేక్..
మాళవిక మోహనన్ కు నిజమైన స్టార్ రికగ్నిషన్ ఇచ్చింది దళపతి విజయ్, విజయ్ సేతుపతి లతో కలిసి నటించిన 'మాస్టర్' చిత్రం. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2021లో భారీ విజయం సాధించింది. ఆ చిత్రంలో ఆమె చేసిన మాలవీ పాత్ర తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నా, ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేసింది. ఆ తరువాత ఆమెకు తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి.

సూపర్ స్టార్ పక్కన ప్రత్యేక పాత్ర..
మాళవిక పేరు చెబితే, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'పేట' సినిమా తప్పనిసరిగా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో ఆమె మైఖేల్ కుమార్తె పాత్రలో కనిపించింది. రజనీతో షేర్ చేసిన స్క్రీన్ స్పేస్ ఆమెకు తమిళ ఇండస్ట్రీలో బలమైన స్థానం ఇచ్చింది. ఇటీవల మాళవిక విక్రమ్ సరసన 'తంగలాన్' సినిమాలో నటించింది. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా ద్వారా ఆమె మరోసారి తన నటనను నిరూపించింది.
ప్రభాస్ 'రాజా సాబ్'..
ఇప్పటి వరకు మాళవిక మోహనన్ స్ట్రెయిట్ తెలుగు సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ ఆ గ్యాప్‌ను పూరించేందుకు ఇప్పుడు సిద్ధమవుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజా సాబ్' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతుండగా, ఇందులో మాళవిక మోహనన్ తో పాటు నిధి అగర్వాల్, రిధి కుమార్ లు కూడా హీరోయిన్లుగా కనిపించనున్నారు. సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ వంటి బలమైన నటీనటులు ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండటంతో, ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.

మెగాస్టార్ చిరంజీవి మూవీలో ఛాన్స్..
మరోవైపు మాళవిక మోహనన్ పేరు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాతో కూడా లింక్ అయింది.
'వాల్తేరు వీరయ్య' తర్వాత దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న 'మెగా 158' చిత్రంలో మాళవికను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లో రక్తంతో తడిసిన గొడ్డలి, ఇంటెన్స్ బ్యాక్‌డ్రాప్ వంటివి హైప్ను రెట్టింపు చేశాయి. ఈ సినిమాలో మాళవిక హీరోయిన్‌గా నటిస్తే, ఇది ఆమె టాలీవుడ్ కెరీర్‌లో మరో కీలక మైలురాయి కానుంది.












Click it and Unblock the Notifications