రామ్ చరణ్‌తో నటించను.. "పెద్ది" లో ఆఫర్ రిజక్ట్ చేసిన మల్లు హాట్ బ్యూటీ !

మలయాళ నటి స్వాసిక తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. 2009లో మలయాళం సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. అలానే రియాలిటీ షోలు, టీవీ సీరియల్స్ ద్వారా కూడా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా మలయాళంలో చతురం, తమిళంలో 'లబ్బర్ పందు'లో నటించి మంచి మార్కులు సాధించింది. ఇక తెలుగులో సైతం రీసెంట్‌గా రిలీజైన నితిన్ 'తమ్ముడు' సినిమాలో విలన్‌గా చేసి మెప్పించింది. ప్రస్తుతం సూర్య 'కరుప్పు' మూవీలో కీలక పాత్ర చేస్తోంది.

అయితే వయస్సు చిన్నదే అయినా కానీ తల్లి పాత్రలు.. ఎక్కువ వయస్సు ఉన్న పాత్రల తోనే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇక సినిమాల్లో నిజ జీవితంలో తక్కువ వయసులో ఉన్న కొందరు.. తమ కంటే పెద్ద వారు అయిన హీరోలకు తల్లి-పిన్ని తరహా పాత్రలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ తరహా అనుభవం తనకు కూడా ఎదురైందని ఓపెన్ అయ్యింది స్వాసిక. ఏకంగా రామ్ చరణ్ తల్లిగా నటించే ఛాన్స్ వచ్చిందని.. కానీ ఆ ఆఫర్ రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చింది. ఆ సంగతి ఏంటో తెలుసుకుందాం..

malayalam-actress-swasika-comments-on-ram-charan-peddi-movie

అందుకే కాదన్నాను..!

స్వాసిక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లబ్బర్ పందు మూవీ తర్వాత తల్లి పాత్రలు వరసపెట్టి వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కాదు గానీ రామ్ చరణ్‌కి తల్లిగా నటించే ఛాన్స్ రావడం మాత్రం నాకు పెద్ద షాక్ ఇచ్చింది. 'పెద్ది' మూవీలో అడిగితే.. నేను చేయనని చెప్పేశాను. చేసుంటే ఎలా ఉండేదే ఏమో గానీ ఇప్పుడు ఒప్పుకోవడం కరెక్ట్ కాదనిపించింది. భవిష్యత్తులో ఇదే అవకాశం వస్తే మాత్రం ఆలోచిస్తాను అని స్వాసిక చెప్పుకొచ్చింది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'పెద్ది'. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్​ ఏఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కాబోతుంది.

malayalam-actress-swasika-comments-on-ram-charan-peddi-movie

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తీస్తున్నారు. ఇప్పటికే ఓ గ్లింప్స్ రాగా అంచనాలు పెంచేసింది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ శివారులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు.

యంగ్ బ్యూటీని రామ్ చరణ్‌ కు తల్లిపాత్రలో చూపిస్తే కూడా చూడడానికి సింక్ పోతుందేమో అని పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమని రామ్ చరణ్ తల్లి పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+