ఆ హీరో ఎంగేజ్మెంట్ దాచిపెట్టి నాతో డేటింగ్ చేశాడు: ప్రముఖ హీరోయిన్
మలయాళ చిత్రం 'మయూక్'తో కెరీర్ ప్రారంభించిన మమతా మోహన్ దాస్.. తెలుగులో ఎన్టీఆర్ సరసన 'యమదొంగ' మూవీతో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హోమం, కింగ్, కేడి వంటి చిత్రాల్లో నటించి అభిమానుల మన్ననలను పొందారు. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఆమె రెండుసార్లు క్యాన్సర్ బారిన పడ్డారు. అటు అనారోగ్యం, ఇటు వ్యక్తిగత జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినా ఆమె ఎంతో ధైర్యంగా పోరాడి మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు.
నమ్మించి మోసం చేసిన మలయాళ నటుడు
ఇటీవల సుహాసిని మణిరత్నం నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మమత.. తన ప్రేమ, డేటింగ్ జీవితం గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. "క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత ఒక మహిళగా నా జీవితంలో కొన్ని కోరికలను నెరవేర్చుకోవాలనుకున్నాను. ఆ సమయంలో ఒక ప్రముఖ మలయాళ నటుడు నన్ను డేటింగ్‌కు ఆహ్వానించాడు. మా అమ్మ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేను అతనితో డేటింగ్‌కు వెళ్లాను. కానీ, అప్పటికే అతనికి వేరే మహిళతో ఎంగేజ్మెంట్ జరిగిందనే విషయాన్ని నా దగ్గర దాచిపెట్టాడు. దాదాపు ఒక నెల తర్వాత అతని సోదరుడి ద్వారా ఈ విషయం తెలిసి నేను షాక్ అయ్యాను. అతను నన్ను నమ్మించి మోసం చేయడం నా మనసును ఎంతగానో గాయపరిచింది" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వివాహం.. ఆరు నెలలకే విడాకులు
తన మాజీ భర్త ప్రజీత్ పద్మనాభన్ గురించి కూడా మమత మనసు విప్పారు. "నా భర్త ప్రజీత్ పరిచయం అతని సోదరి పెళ్లిలో జరిగింది. మా ఇద్దరి అభిరుచులు కలవడంతో వెంటనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ పెళ్లయిన ఆరు నెలలకే మేము విడిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నేను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను. అది చాలా కఠినమైన నిర్ణయం అయినప్పటికీ తప్పలేదు" అని ఆమె చెప్పుకొచ్చారు.
మళ్లీ పెళ్లికి సిద్ధమే!
ఇన్ని బాధలు అనుభవించినప్పటికీ, జీవితం పట్ల మమత ఇప్పటికీ సానుకూలంగానే ఉన్నారు. తనకు సరైన భాగస్వామి దొరికితే మళ్లీ వివాహం చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. "జీవితం చాలా అందమైనది. మనసులో ఉన్న నెగెటివ్ ఆలోచనలను తొలగించుకుని ముందడుగు వేయాలి" అని మమతా మోహన్ దాస్ తోటి మహిళలకు సూచించారు.
-
హారర్ థ్రిల్లర్ సినిమా వచ్చేస్తుంది..గూస్బంప్స్ గ్యారెంటీ బాసూ -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
ఇదేం టీజర్ రా బాబోయ్.. మహేష్ అన్నకొడుకు ఏడిపించాడు భయ్యా.. మరో ఆర్ఎక్స్ 100..! -
పగలు మనిషి.. రాత్రి అయితే.. 'రాకా' లో అల్లు అర్జున్ క్యారెక్టర్ తెలిస్తే గూస్ బంప్స్..! -
ఆ స్టార్ హీరో నా క్లాస్ మెట్.. అన్నం పెట్టిన రోజుల్ని మర్చిపోలేను -
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ???











Click it and Unblock the Notifications