తమ్ముడు మనోజ్‌ను చూసి ఏడ్చిన మంచు లక్ష్మి.. వీడియో వైరల్
మంచు కుటుంబ వివాదం ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చింది. హైదరాబాద్ శివారులోని జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంట్లోకి ఆయన కుమారుడు మంచు మనోజ్ ప్రవేశించాలని ప్రయత్నించగా పెద్ద కుమారుడు విష్ణు అనుచరులు అడ్డుకోవడం తీవ్ర దుమారం రేపింది. దీంతో మంచు మనోజ్ కొద్దిసేపు ధర్నా చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇప్పటికే మంచు మనోజ్, మంచు విష్ణు ఒకరిపైఒకరు కేసులు పెట్టుకోవడం, కోట్లు మెట్లు ఎక్కడం అన్నీ జరిగిపోయాయి. ఈ క్రమంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఓ కార్యక్రమంలో మంచు విష్ణు, మంచు లక్ష్మి కలుసుకున్నారు. చిన్న తమ్ముడ్ని చూడగానే మంచు లక్ష్మి కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో అక్కడున్నవాళ్లు ఆమెను షాక్ తో చూశారు. ఈ దశలో మంచు మనోజ్ అర్ధాంగి మౌనిక వచ్చి ఆ అక్కాతమ్ముడ్ని ఓదార్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఏం జరిగిందంటే..?
ప్రస్తుతం మంచు లక్ష్మి 'టీచ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించాలన్న లక్ష్యంతో మంచు లక్ష్మి ఈ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సంస్థ తెలంగాణలోని అనేక పాఠశాలలను దత్తత తీసుకుని మెరుగైన సౌకర్యాలు అందిస్తోంది. ఈ సంస్థకు నిధుల సమీకరణ కోసం శనివారం రాత్రి మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఫ్యాషన్ షో ఏర్పాటు చేశారు. డిజైనర్ స్వాతి వెలిదండి రూపొందించిన దుస్తుల్లో సినీతారలు ర్యాంప్ వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు. ఈ షోలో రియా చక్రవర్తి, కేతికా శర్మ, అనసూయ సహా మొత్తం 42 మంది సినీతారలు పాల్గొన్నారు.
#ManchuLakshmi got emotional 🥹 as soon as she saw her brother #ManchuManoj at an event yesterday 🖤 pic.twitter.com/7jgGGqKxTQ
— Movies4u Official (@Movies4u_Officl) April 13, 2025
అయితే ఈ కార్యక్రమంలోనే మంచు లక్ష్మి స్టేజీ మీద నిలబడి ఉండగా ఆమె తమ్ముడు మంచు మనోజ్ వెనక నుంచి వచ్చి పట్టుకున్నాడు. తమ్ముడిని చూడగానే ఒక్కసారిగా ఏడ్చేశారు. దీంతో మనోజ్ అక్కని గట్టిగా హత్తుకుని ఓదార్చాడు. మనోజ్ భార్య మౌనిక కూడా ఆమె ఓదార్చగా.. మంచు లక్ష్మి ఇద్దరి చేతులు పట్టుకుని భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు అక్కా తమ్ముళ్ల అనుబంధం ఎంత గొప్పదోనని కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications