మంచు లక్ష్మి ఇన్ స్టా గ్రామ్ హ్యాక్.. నైజీరియా నుంచి బెదిరింపు కాల్స్.. తీవ్ర ఆవేదనలో నటి

సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్​ ను హ్యాక్​ చేస్తుంటారు కొందరు ఆకతాయిలు. అలా హ్యాక్ చేసి తమకు నచ్చినట్లుగా అసభ్యకర పోస్టులు, వీడియోలు షేర్​ చేస్తుంటారు. ఇలా హ్యాక్​ గురైన సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. ఈ క్రమంలోనే సినీ నటి, టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మికి బిగ్ షాక్ తగిలింది. ఆమె అధికారిక ఇన్ స్టా గ్రాం అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి స్వయంగా ప్రకటించింది. తన అధికారిక ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ఆమె తెలిపింది. తనకు నైజీరియా నుంచి కాల్స్ వస్తున్నాయని.. తనకు మెసేజ్ చేయాలని, కాల్స్ చేయాలని బెదిరింపులు వస్తున్నాయని తనకు భయంగా ఉందని ఆవేదన చెందింది మంచు లక్ష్మి.

మంచు లక్ష్మీ తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ హ్యాక్ అయిందని ఎక్స్ వేదికగా ట్వీట్ వేసింది. కాస్త జాగ్రత్తగా ఉండమని, ఏదైనా మెసెజ్‌ వస్తే పట్టించుకోవద్దని.. తనకు ఏమైనా డబ్బులు కావాల్సి వస్తే నేరుగానే అడిగేస్తా అని, ఇలా సోషల్ మీడియాలో అడగనని చెప్పుకొచ్చింది మంచు లక్షి. మళ్లీ ఇన్ స్టా గ్రామ్ తన చేతికి వచ్చిన తరువాత చెబుతాను అని ట్వీట్ వేసింది.

Manchu Lakshmi s Instagram Account Hacked Here s What We Know

అయితే ఆమె ఇన్ స్టా గ్రామ్ హ్యాక్ అయిన తర్వాత నైజీరియా నుంచి ఓ గుర్తుతెలియని వ్యక్తి నా నంబర్ కు ఫోన్ చేసినట్లు ఎక్స్ వేదికగా ఆమె వాపోయారు. మెసేజ్, ఫోన్ చేయాలని బెదిరించినట్లు చెప్పారు. తనకు భయంగా ఉందని అన్నారు. ఈ విషయంపై నెటిజన్లు స్పందిస్తూ నైజీరియా వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు.

ఇక మంచు లక్ష్మి ఇటీవల తమ్ముడు మనోజ్ ను చూసి కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అప్పుడే మంచు లక్ష్మీ, మనోజ్ మధ్య ఎమోషనల్ బాండింగ్ అందరికీ అర్థమైంది. ఈ క్రమంలో మంచు లక్ష్మి, మనోజ్ ఓ సైడ్.. మోహన్ బాబు, విష్ణు మరో సైడ్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆమె ఇన్ స్టా గ్రామ్ హ్యాక్ కావడం మంచు అభిమానుల్లో ఆందోళన రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+