ఊర మాస్ లుక్కులో మోహన్ బాబు.. "ప్యారడైజ్"లో విలన్‌గా కన్ఫార్మ్ !!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మళ్లీ విలన్ అవతారం ఎత్తారు. ఇటీవల కాలంలో మంచి సక్సెస్ కోసం చూస్తున్న ఆయన.. మళ్లీ తనకు బాగా కలిసొచ్చిన విలన్ పాత్రతో బాక్సాఫీస్ ఊచకోతకు సిద్దామయ్యారు. ప్రస్తుతం ఆయన నేచురల్ స్టార్ నాని నటిస్తున్న "ది ప్యారడైజ్ " మూవీలో నటిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. గతంలో నాని - శ్రీకాంత్ కాంబినేషన్లో వచ్చిన 'దసరా' మంచి హిట్ సాధించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రీసెంట్ గానే ఓ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న మంచు లక్ష్మి.. మోహన్‌బాబు 'ది ప్యారడైజ్' మూవీలో నటిస్తున్నట్టు అప్‌డేట్ ఇచ్చారు. తన లుక్ కోసం ఎంత కష్టపడుతున్నారో చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యా. ఆయన స్థాయిలో ఉన్న మరో నటుడైతే ఎలా ఉంటే అలాగే నటిస్తానని కండిషన్లు పెడతారు. కానీ నాన్న మాత్రం క్యారెక్టర్ కోసం తనని తాను మలుచుకుంటున్నారని తెలిపారు. దీంతో మోహన్‌బాబు నటిస్తున్నారని ఫిక్స్ అయ్యారు.

ఇప్పుడు లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మోహన్ బాబు ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో షికంజా మాలిక్ అనే పాత్రలో మోహన్ బాబు కనిపిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ పోస్టర్ లో మోహన్ బాబు లుక్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్లు ఉంది. షర్ట్ లేకుండా..ఒక చైర్ లో కూర్చొని.. రక్తంతో తడిసిన చేతుల మధ్యలో తుపాకీ.. గాగుల్స్ పెట్టుకొని, చేతిలో సిగార్ తో టెర్రిఫిక్ లుక్ తో కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.
కాగా ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ సైతం సెన్సేషన్ గా మారాయి. చేతిపై లం********* కు అనే టాటూ, అసభ్య పదజాలం మాత్రం అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది. ఇందులో నాని 'జడల్' అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్‌లుక్స్ రిలీజ్ కాగా నాని ఇప్పటివరకు కనిపించని కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు.
మరోవైపు ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఓ క్యామియో రోల్ ని .. చిరంజీవితో చేయించాలని శ్రీకాంత్ ఓదెల అనుకున్నారట. ఈ మేరకు మెగాస్టార్ ని కలిసి కథ వినిపించగా అందుకు ఒకే చెప్పారని సమాచారం. శ్రీకాంత్ ఓదెల తన నెక్ట్స్ మూవీని చిరంజీవితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హీరో నాని నిర్మిస్తున్నారు. ఈ రిలేషన్ కారణంగానే మెగాస్టార్ చిరంజీవి ఇందులో నటిస్తున్నారని ఫిక్స్ అవుతున్నారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications