"కన్నప్ప" ఓటీటీలోకి రాదు.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్
మంచు విష్ణు ప్రధానపాత్రలో నటించిన "కన్నప్ప" సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్, ప్రభాస్ సీన్స్, మంచు విష్ణు నటన ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూసిన విష్ణు.. సినిమా విజయంపై ఎమోషనల్ అయ్యారు. ఇదంతా ఆ పరమ శివుడి దయలాగా అనిపిస్తోందన్నారు. మాటలు రావడం లేదని భావోద్వేగం వ్యక్తం చేశారు.
మంచు విష్ణు లేటెస్ట్ మూవీ కన్నప్ప పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. మూవీ రిలీజ్ రోజుకు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీని ఓటీటీకి ఎప్పుడు తీసుకొస్తారని విలేఖరి ప్రశ్నించగా.. ఆయన సమాధానం చెప్పారు. కన్నప్ప సినిమా 10 వారాల తర్వాతే ఓటీటీకి వస్తుందని స్పష్టం చేశారు. రిలీజ్ విషయంలో నాపై ఒత్తిడి లేదని చెప్పారు. అందుకే కన్నప్ప ను పది వారాల తర్వాతే ఓటీటీలోకి తీసుకొస్తామని వెల్లడించారు.

మంచు విష్ణు నిర్ణయంతో ఈ సినిమాను ఓటీటీలో చూడాలంటే కనీసం రెండున్నర నెలలు ఆగాల్సిందేనని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నప్పటికీ.. సినిమా విజయం వారిలో కొంత సంతృప్తిని ఇచ్చింది. ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తొలి షో నుంచే కన్నప్పకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో ప్రభాస్.. రుద్ర పాత్రలో మెరిశారు. ఇక మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు. మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications