రక్తం పంచుకొని పుట్టినవాళ్లే నా పతనాన్ని కోరుతున్నారు - మంచు విష్ణు

మంచు ఫ్యామిలీలో విభేదాల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. గొడవలు, కేసులతో మంచు వారి కుటుంబంలో కలహాలు పీక్స్ కి చేరగా.. పోలీసులు కౌన్సిలింగులతో కాస్త సబ్రేక్ పడినట్టు భావించారు. కానీ రీసెంట్ గానే మళ్లీ ఈ ఇష్యూ బయటపడగా.. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు ఉండడంతో అంతా సర్దుమనిగిందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ మధ్య అన్నదమ్ములు మంచి విష్ణు, మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేసుకున్నారు.

అయితే మంచు మనోజ్ - మంచు విష్ణు మధ్య వివాదం నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉన్నట్టు భావిస్తున్న తరుణంలో ఇటీవలే యూఎస్ వెళ్లిన విష్ణు.. అక్కడ ఓ పాడ్‌ కాస్ట్‌ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ప్రభాస్ గురించి చెబుతూ.. రక్తం పంచుకొని పుట్టినవాళ్లే ఈరోజు నా పతనాన్ని కోరుకునేటప్పుడు.. ప్రభాస్‌ మాత్రం నా మంచి కోరి నా సక్సెస్ కోరుతున్నాడు. ఎన్ని జన్మలకైనా అతనికి రుణపడి ఉంటానని వ్యాఖ్యానించారు. నిజంగా ప్రభాస్ కి నేను కృతజ్ఞుడిగా ఉంటానని చెప్పుకొచ్చారు. దీంతో ఈ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

manchu-vishnu-shocking-comments-on-prabhas-and-manoj

మంచు విష్ణు ఇంకా ఏమన్నారంటే..

కన్నప్ప సినిమాలో నటించినందుకు గాను ప్రభాస్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని విష్ణు తెలిపారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని విష్ణు అన్నారు. ప్రభాస్ ఎంత పెద్ద స్టార్ అనేది అతడికి తెలియదని.. తన లోకంలో తాను ఉంటాడని తెలిపారు. ప్రభాస్‌లా చాలా తక్కువ మంది ఉంటారని.. అంత హంబుల్ గా ఉండటం అతని గొప్పతనం అంటూ పొగడ్తలు కురిపించారు. గతంలో సైతం మనం ఎప్పటికీ గ్రేట్ ఫ్రెండ్స్ గా ఉంటామని వారు మాట్లాడుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇక మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప'. మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి సహా పలువురు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అలానే ఈ చిత్రంలో రుద్ర అనే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. ఆయనది స్పెషల్ రోల్ అయినప్పటికీ.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+