ఇద్దరు స్టార్ హీరోలపై ఎంపీ సుమలత సంచలన వ్యాఖ్యలు, పిలిస్తే ఢిల్లీ వెలుతా, అయితే ఈసారి!
మండ్యలో బీజేపీ-జేడీఎస్ కూటమి టికెట్ తనకు వంద శాతం ఖాయమని ఎంపీ సుమలత అంబరీష్ ధీమా వ్యక్తం చేశారు. ఆదిచుంచనగిరి శ్రీక్షేత్రాన్ని సందర్శించిన సుమలత తరువాత మీడియాతో మాట్లాడారు. తనకు ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం లేదని, నన్ను రమ్మని పార్టీ హైకమాండ్ చెబితేనే వెళ్తానని, కర్ణాటక అభ్యర్థుల జాబితా వస్తే మండ్యలో తనకు కూడా సీటు వస్తుందని సుమలత ధీమాగా చెప్పారు.
లోక్ సభ ఎన్నికల సన్నద్ధతపై నిర్దిష్ట ప్రణాళిక లేదు. ఈసారి రాజకీయ పార్టీ బ్యానర్‌తో పోటీ చేస్తున్నానని, మరి దీనిపై పార్టీ హైకమాండ్, పార్టీ నేతలు ఏం చెబుతారో వేచి చూడాలని, ఈసారి లోక్ సభ ఎన్నికలు విభిన్నంగా జరగనున్నాయని, ప్రచారం, పోరాటం, ప్రచారం విభిన్నంగా ఉంటాయని సుమలత అంబరీష్ అన్నారు. కేజీఎఫ్ హీరో యశ్, చాలెంజింగ్ స్టార్ దర్శన్ తనకు మద్దతుగా లోక్ సభ ఎన్నికల ప్రచారానికి ప్రచారానికి వస్తే బలం ఉంటుందని అందరూ సపోర్ట్ చేస్తున్నారని సుమలత అన్నారు.

గత లోక్ సభ ఎన్నికల సమయంలో స్వార్థం లేకుండా నాకు అండగా ఇద్దరు హీరోలు యశ్, దర్శన్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు తనకు అండగా నిలిచారని, ఇప్పుడు వాళ్ల పనులు అన్నీ వదిలేసి ఎన్నికల ప్రచారానికి రావాలని పదే పదే పిలవడం సరికాదని సుమలత అంబరీష్ అభిప్రాయం వ్యక్యం చేశారు. కొందరి అభిప్రాయాలతో నేను ఏకీభవించనని, హీరోలు యశ్, దర్శన్ వారివారి సినిమాలతో బిజీగా ఉన్నారని సుమలత అంబరీష్ గుర్తు చేశారు.
ఇవన్నీ వదిలి నా కోసం ఎన్నికల ప్రచారానికి రావాలని పిలవడం సరికాదని, అయితే వాళ్లు తన కోసం ఎన్ననికల ప్రచారానికి వస్తే తప్పకుండా స్వాగతిస్తానని, వారి మద్దతు నాకు పెద్ద బలం అని సుమలత అంబరీష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో యశ్ పాల్గొనకపోవడంపై మీడియా ప్రశ్నించగా ప్రస్తుత రాజకీయాలు దారుణంగా ఉన్నాయని ఇటీవల యశ్ తనతో అన్నారని మండ్య ఎంపీ సుమలత అంబరీష్ అన్నారు.

పలువురి విమర్శల గురించి తెలుసుకున్నానని, ఇప్పుడు జాతీయ స్థాయిలో స్టార్ గా ఎదిగిన యశ్ తనకు ప్రచారం చెయ్యాలని తాను ఆశించడం సరికాదని, వాళ్ళు తన కొసం ఎన్నికల ప్రచారానికి వస్తే తాను సంతోషిస్తానని, హీరోలు దర్శన్, యశ్ నా కుటుంబంలో పిల్లలు లాంటి వారు అని, గతంలో తనకు వారు అండగా నిలబడ్డారని, తనకు మద్దతుగా లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వాళ్లు రాకపోయినా నేను పెద్దగా పట్టించుకోనని సుమలత అన్నారు. అయితే ఈసారి లోక్ సభ ఎన్నికల్లో తాను పార్టీ గుర్తు మీద పోటీ చేస్తానని సుమలత అంబరీష్ ధీమా వ్యక్తం చేశారు.
-
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ?












Click it and Unblock the Notifications