పవన్ కల్యాణ్ - రవితేజ - మణిరత్నం కాంబోలో మిస్సయిన బ్లాక్‌బస్టర్

మణిరత్నం లాంటి లెజెండరీ దర్శకుడి దర్శకత్వంలో సినిమా చేయాలని ప్రతి స్టార్ హీరో కలలు కంటుంటాడు. కథ ప్రకారం సినిమాలు తీసే మణిరత్నానికి అందుకు తగ్గవారినే ఎంచుకునే అలవాటుంది. వారు స్టార్ నటులా? లేదంటే చిన్న నటులా? అనేది చూడరు. మధ్యలో కొంత సమయం సినిమాలు ఫ్లాపై వెనకబడినప్పటికీ పొన్నియన్ సెల్వన్ 1, 2 భాగాలతో బ్లాక్ బస్టర్ హిట్లు సాధించారు. ప్రస్తుతం కమల్ హాసన్ తో థగ్ లైఫ్ సినిమా చేస్తున్నారు. దీనితర్వాత రజనీకాంత్ తో కూడా సినిమా ఓకే అయింది. అటువంటి దర్శకుడి దర్శకత్వంలో మన తెలుగు స్టార్ హీరోలు ఇద్దరు నటించే అవకాశాన్ని కోల్పోయారు.

ఇద్దరు స్టార్ హీరోలతో కష్టం
తమిళంలో మణిరత్నం యువ సినిమా చేశారు. సూర్య, మాధవన్, సిద్ధార్థ, త్రిష, మీరాజాస్మిన్, ఈషాడియోల్ నటించారు. సూపర్ హిట్ అయింది. సంచలన వసూళ్లు రాబట్టింది. హిందీలో అజయ్ దేవగణ్, అభిషేక్ బచ్చన్ తో తీశారు. అక్కడా హిట్ అయింది. తెలుగులో పవన్ కల్యాణ్, రవితేజ కాంబినేషన్ లో తీయాలని మణిరత్నం నిర్ణయించుకొని కథ చెప్పారు. ఇద్దరికీ కథ నచ్చింది. అయితే షూటింగ్ కు వెళ్లేముందు పవన్ కల్యాణ్ ఓ సందేహం వెలిబుచ్చారు. తెలుగులో ఇద్దరు స్టార్ హీరోలతో ఈ సినిమాతీస్తే కష్టమవుతుందేమో, ఆడదేమో అన్నారంట. మీరు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందకపోతే సినిమా తీయొద్దు.. వేరే కథతో సినిమా తీద్దామని మణిరత్నం అన్నారు.

mani ratnam and pawan kalyan and raviteja combination movie missed details here

అటకెక్కిన యువ
ఆ తర్వాత ఏ కథతోను సినిమా తెరకెక్కలేదు. యువ సినిమా తెలుగులో అటకెక్కింది. తర్వాత అదే పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదల చేయగా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతోనే సూర్య తెలుగు ప్రేక్షకులకు మొదటిసారిగా పరిచయం అయ్యాడు. సినిమా మొత్తం స్లో నెరేషన్ లో సాగుతుందని, మణిరత్నం-పవన్ కల్యాణ్ అంటే అంచనాలు భారీస్థాయిలో ఉంటాయని, అంత స్లో నెరేషన్ వీరికి పనికివచ్చేదికాదని, కచ్చితంగా సినిమా ఫ్లాప్ అయ్యేదని, పవన్ కల్యాణ్ చెప్పిందే సరైందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+