రేయ్ ఎవడ్రా ఇది ఎడిట్ చేసింది..రామ్ చరణ్‌ను ఇలా అవుట్ చేశారేంట్రా..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటిస్తోన్న చిత్రం "పెద్ది". ఉప్పెన ఫేం బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ షాట్ పేరిట గ్లింబ్స్‌ను రిలీజ్ చేశారు.ఈ వీడియోలో రామ్ చరణ్ మాస్ అవతార్‌లో కనిపించాడు. రంగస్థలం తర్వాత తిరిగి రామ్ చరణ్ మాస్ లుక్‌లో కనిపించిన సినిమా ఇదే."ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి.. పుడాతామా ఏంటి మళ్లీ." ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ చెప్పే డైలాగ్స్ కేక పుట్టించాయి.ముఖ్యంగా గ్లింప్స్ చివర్లో రామ్ చరణ్ కొట్టిన సిక్స్ షాట్ మాత్రం హైలెట్ అని చెప్పాలి.

ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బీజీఎం ఆకట్టుకుంది.టీజర్ మొత్తం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో ఎక్కడా చూసిన "పెద్ది" ఫస్ట్ షాట్ గ్లింబ్స్‌ హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ కొట్టిన సిక్స్ షాట్‌‌పై అనేక మీమ్స్ వస్తున్నాయి. రామ్ చరణ్ కొట్టిన సిక్స్‌తో బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ అవుతాయ్ అంటూ మెగా అభిమానులు మీమ్స్ చేస్తున్నారు. మరికొందరు ప్రభాస్ బౌలింగ్‌లో రామ్ చరణ్ బ్యాటింగ్ చేయగా, దాన్ని ఎన్టీఆర్ క్యాచ్ పట్టుకున్నట్టు చేసిన ఓ మీమ్ తెగ వైరల్ అవుతుంది.

Many memes are going viral on Ram Charan Peddi movie Glimpse

రామ్ చరణ్ అవుట్ అవ్వడంతో పవన్ కల్యాణ్ డ్యాన్స్ కూడా జత చేయడం ఈ మీమ్‌లో కనిపించింది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.అయితే బాక్సాఫీస్ వద్ద 'గేమ్ ఛేంజర్'సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే రామ్ చరణ్ కెరీర్‌లోనే 'గేమ్ ఛేంజర్' సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో "పెద్ది" సినిమాపై మెగా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఫస్ట్ షాట్ పేరిట వచ్చిన గ్లింబ్స్‌ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. 2026 మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+