మిస్టరీ థ్రిల్లర్ గా 'మారెమ్మ' ట్రైలర్.. రవితేజ వారసుడు బ్లాక్ బస్టర్ ఎంట్రీ..!

టాలీవుడ్ లో కొత్త హీరోలు.. యువ నటీనటుల జోష్ మొదలైంది. ఇటీవలి కాలంలో కొత్త హీరోల సినిమాలు అనేకం రిలీజై బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఇటీవలికాలంలో కుర్ర హీరోలు, హీరోయిన్ ల రాక శుభపరిణామంగా కనిపిస్తోంది. ఈ ఏడాది లిటిల్ హార్ట్స్ లాంటి చిత్రంతో మౌళి హీరోగా చిత్ర సీమకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు మైత్రి మూవీస్ సంస్థతో దొంగ నా కొడుకు అనే మూవీ చేస్తున్నాడు. అలాగే ఇటీవల ఘట్టమనేని జయకృష్ణ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో శ్రీనివాస మంగాపురం అనే సినిమాతో ప్రేక్షకుల్ని అలరించాడు. ఇప్పుడు మాస్ మహారాజ రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ భూపతి రాజు హీరోగా మారెమ్మ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో డివోషనల్ టచ్ కూడా ఉంది. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా కట్ చేశారు. హీరో మాధవ్ భూపతి రాజు సరసన దీప బాలు కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి మంచాల నాగరాజు దర్శకత్వం వహించారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన టీజర్‌ తో సినిమాపై ఆసక్తిని పెంచిన మారెమ్మ చిత్ర బృందం.. ఇప్పుడు ట్రైలర్ ద్వారా కథకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర అంశాలను ప్రేక్షకులకు పరిచయం చేసింది.

Maremma The trailer for the movie released now the film is set for a grand release on September 10

ప్రతి దేశానికి ఒక చరిత్ర ఉన్నట్టు.. ప్రతి ఊరి పుట్టుకకు కూడా ఒక సాంప్రదాయం ఉంటుంది.. అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. అయితే ఆ గ్రామంలో ఓ సంక్షోభం ఎదురవుతుంది. దాంతో గ్రామస్థులు తమ గ్రామ దేవత అయిన మరెమ్మ తల్లిపై నమ్మకం పెట్టుకుంటారు. వచ్చే మూడో పౌర్ణమి లోపల.. ఊరిలో గేదెకి మగ బిడ్డ పుడుతుంది అని ఒక జ్యోతిష్కుడు చెబుతాడు. అయితే ఆ దున్న బాధ్యతను హీరోకి అప్పగిస్తారు గ్రామస్థులు. జాతరలో బలి ఇచ్చేందుకు దున్నపోతును పెంచుతారు. ఇక జాతర దగ్గర పడే సమయంలో దున్న కనిపించకపోవడం.. ఊరిలో ప్రజలు చనిపోవడం.. ఏడేళ్ల పగ ఇలా అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 10 న గ్రాండ్ గా విడుదల కానుంది.

ఇక మారెమ్మ చిత్రంలో వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, వీఎస్ రూపలక్ష్మి, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. మయూర్ రెడ్డి బండారు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. మరి ఈ గ్రామీణ నేపథ్యంలోని మిస్టరీ, యాక్షన్ మూవీ థియేటర్లలో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+